
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హరోం హర. గతనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు.
అయితే హరోం హర ఓటీటీకి స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ముందుగా ప్రకటించినట్లుగా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ హరోం హర ఓటీటీకి రాలేదు. అయితే సాంకేతికపరమైన సమస్యతోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు ఆలస్యమైనా స్ట్రీమింగ్‌కు వస్తుందా? లేదా కొత్త తేదీని ప్రకటిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment