
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల తేదీ మారింది. ముందుగా ఈ నెల 31న సినిమా విడుదలకు యూనిట్ ΄్లాన్ చేసింది. అయితే జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, సుధీర్ కొత్తపోస్టర్‌ని రిలీజ్ చేశారు.
జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ‘హరోం హర’లో మాళవికా శర్మ కథానాయిక. సుమంత్ జి. నాయుడు నిర్మించారు. ‘‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘హరోం హర’. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది’’ అన్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment