నవంబరులో జీబ్రా | Satya Dev Zebra On November 22 | Sakshi
Sakshi News home page

నవంబరులో జీబ్రా

Published Wed, Oct 30 2024 12:07 AM | Last Updated on Wed, Oct 30 2024 12:07 AM

Satya Dev Zebra On November 22

సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ అన్నది ట్యాగ్‌లైన్‌. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్‌ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌. పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించారు.

ఈ సినిమాని నవంబరు 22న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, సత్యదేవ్, ధనుంజయ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘జీబ్రా’. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్, మోషన్‌ వీడియో, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య పొన్మార్, సంగీతం: రవి బస్రూర్, సహనిర్మాత: ఎస్‌. శ్రీలక్ష్మి రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement