Dhanunjaya
-
నవంబరులో జీబ్రా
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ట్యాగ్‌లైన్. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సత్యరాజ్, సత్య అక్కల కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు.ఈ సినిమాని నవంబరు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, సత్యదేవ్, ధనుంజయ పోస్టర్ని విడుదల చేశారు. ‘‘క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘జీబ్రా’. ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియో, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య పొన్మార్, సంగీతం: రవి బస్రూర్, సహనిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి రెడ్డి. -
శాండల్‌వుడ్‌కి సై అంటున్న పాయల్ రాజ్‌పుత్
కన్నడ పరిశ్రమ నుంచి ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు పిలుపొచ్చింది. కన్నడ హీరో ధనుంజయ నటిస్తున్న తాజా చిత్రం ‘హెడ్ బుష్’లో హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ నటించనున్నారు. ఆదివారం అధికారిక ప్రకటన వెల్లడైంది. శూన్య డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం బెంగళూరులో ప్రారంభం కానుంది. ఓ డాన్ జీవితం ఆధారంగా 1960–1980 కాలంలో సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుందనేది శాండల్‌వుడ్ టాక్. బెంగళూరుతో పాటు మైసూర్, కోలార్ ప్రాంతాల్లో ‘హెడ్ బుష్’ సినిమా షూట్‌ను ప్లాన్ చేశారట. అంతేకాదు.. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే కన్నడ పరిశ్రమలో హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మరోవైపు తెలుగులో ఆదీ సాయికుమార్ సరసన ‘కిరాతక’, తమిళ చిత్రం ‘ఏంజెల్’ చిత్రాలు చేస్తున్నారు పాయల్ రాజ్‌పుత్. ఇక పోలీసాఫీసర్‌గా పాయల్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘5 డబ్ల్యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
‘భైరవ గీత’ మూవీ రివ్యూ
టైటిల్ : భైరవ గీత జానర్ : ఫ్యాక్షన్ డ్రామా తారాగణం : ధనుంజయ, ఇర్రా మోర్, బాల రాజ్వాడీ, విజయ్ రామ్ సంగీతం : రవి శంకర్ దర్శకత్వం : సిద్ధార్థ్ తాతోలు నిర్మాత : రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుస పరాజయాలతో ఫాం కోల్పోయిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా గ్యాప్ ఇచ్చినా నిర్మాతగా సందడి చేస్తున్నాడు. సిద్దార్థ్ తాతోలును దర్శకుడిగా ధనుంజయ, ఇర్రామోర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన పిరియాడిక్ ఫ్యాక్షన్ డ్రామా భైరవ గీత. వర్మ మార్క్ ప్రమోషన్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో నిర్మాతగా అయినా వర్మ సక్సెస్ సాధించాడా..? తొలి చిత్రంతో సిద్దార్థ్ ఏమేరకు ఆకట్టుకున్నాడు..? కథ : రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. అలా గతంలో చాలా సార్లు టాలీవుడ్లో చూసిన ఓ రొటీన్ కథతో వచ్చిన సినిమానే భైరవ గీత. భైరవ (ధనుంజయ), సుబ్బారెడ్డి(బాల రాజ్వాడీ) అనే ఫ్యాక్షనిస్ట్ దగ్గర పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి.. తన స్థాయికి తగ్గట్టుగా తన కూతురు గీత(ఇర్రా మోర్)ను కట్టారెడ్డి (విజయ్ రామ్) అనే మరో ఫ్యాక్షనిస్ట్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. గీత..భైరవను ప్రేమించటంతో ఇద్దరు ఊరొదిలి పారిపోతారు. విషయం తెలుసుకున్న సుబ్బారెడ్డి, కట్టారెడ్డి.. భైరవ తల్లిని, స్నేహితులను చంపేస్తారు. దీంతో భైరవ, సుబ్బారెడ్డి మీద తిరుగుబాటు చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు.? చిరవకు భైరవ, గీత ఒక్కటయ్యారా? అన్నదే మిగతా కథ. నటీనటులు : భైరవ గీత చూస్తే నటీనటుల ఎంపికలో వర్మకు తిరుగులేదని మరోసారి అర్ధమవుతుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ధనుంజయ, భైరవ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగటంతో పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ధనుంజయ నటన ఆకట్టుకుంటుంది. గీత పాత్రలో కనిపించిన ఇర్రా మోర్ నటన కూడా ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా పరిణతి కలిగిన నటిలా కనిపించింది. పర్ఫామెన్స్తో పాటు గ్లామర్ షోతోను మెప్పించింది. సుబ్బారెడ్డి, కట్టారెడ్డి పాత్రల్లో కనిపించిన బాల రాజ్వాడీ, విజయ్ రామ్ తమ పాత్రలకు కావాల్సిన క్రూరత్వాన్ని పండించారు. విశ్లేషణ : వర్మ.. సినిమా ప్రారంభంలోనే కథ మొత్తం చెప్పేసినా, ఆయన శిష్యుడు సిద్ధార్థ్ (దర్శకుడు) ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోపెట్టగలిగే కథనంతో సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా పాత్రల పరిచయం విషయంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ సినిమా మీద ఆసక్తి పెంచుతుంది. బోల్డ్ కథను అంతే ‘రా’గా వెండితెర మీద చూపించాడు. చాలా సన్నివేశాల్లో సిద్దార్థ్ టేకింగ్ కథను డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే వయలెన్స్ మీద పెట్టిన దృష్టి, ఇతర సన్నివేశాల మీద పెట్టినట్టుగా అనిపించదు. ముఖ్యంగా లవ్ స్టోరి ఏమాత్రం కన్వింన్సింగ్‌గా లేదు. గీత, భైరవను అంతగా ప్రేమించడానికి సరైన కారణం ఎక్కడా కనిపించదు. ద్వితియార్థంలోనూ మంచి ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్నా ఎక్కువగా వయలెన్స్ మీదే దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. విపరీతమైన రక్తపాతంతో కొన్ని సన్నివేశాలు చూడటానికే ఇబ్బంది కలిగిలే ఉండటం, బలమైన కథ, ఎమోషన్స్ లేకపోవటం నిరాశకలిగిస్తాయి. సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటిని తన ఫ్రేమ్స్‌లో చూపించాడు కెమెరామేన్. సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి సంగీతం మైనస్ పాయింట్స్ : పాత కథ మితిమీరిన వయలెన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కిలిమంజారోకు వీకోట యువకుడు
పలమనేరు: ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాల్లో ఒకటైన టాంజానియాలోని కిలిమంజారో పర్వతా రోహణకు వీకోట మండలం పాపేపల్లికి చెందిన యువకుడు ధనుంజయ గౌడ్ ఎంపికయ్యాడు. ఇతను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి పర్వతారోహణమంటే ప్రాణం. తిరుపతిలోని ఎస్వీయూలో బీపీఈడీ చేస్తున్న ఇతను రాష్ట్ర యువజనుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జరిగిన పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. ఇందులో పాల్గొన్న వారిలో 8మంది మాత్రం ఎంపికయ్యారు. అన్ని జిల్లాల నుంచి ఎంపికైన ఎంపికైన 140 మందిని విజయవాడలోని సీబీఆర్ స్పోర్ట్స్ గ్రౌండ్లో మెరుగైన శిక్షణనిచ్చారు. వీరిలో 60మందిని ఎంపికచేసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చారు. అక్కడ 9 అంశాలపై జరిగిన సామర్థ్య పరీక్షల్లో ధనుంజయ సఫలీకృతమయ్యాడు. దీంతో రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఈనెల 7న బయలుదేరి వెళ్లనున్నట్టు ధనుంజయ గౌడ్ సాక్షికి తెలిపారు. ఇతన్ని నియోజకవర్గ వాసులు అభినందిస్తున్నారు. -
భైరవగీత కహానీ ఏంటి?
ధనంజయ, ఇర్రా ముఖ్య తారలుగా సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘భైరవగీత’. దర్శక– నిర్మాత రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో భాస్కర్ రాశి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుని రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా కన్నడ వెర్షన్ ట్రైలర్‌ను నటుడు శివరాజ్‌కుమార్ రిలీజ్ చేయనున్నట్లు రామ్‌గోపాల్ వర్మ వెల్లడించారు. ఇంతకుముందు ‘బాక్సర్, జెస్సీ, తగరు’ వంటి కన్నడ చిత్రాల్లో ధనంజయ నటించారు. -
భార్యాభర్తనాట్యం
యాభై ఏళ్ల భార్యాభర్తల బంధం! అబ్బ.. ఎంత ముచ్చటగా ఉంది! ప్రేమ కలిపింది. నాట్యం నిలిపింది. ఎ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ! నాట్యంతో మమేకమై జీవిస్తున్న దంపతులు అనగానే మనకు ఇక్కడ రాధారెడ్డి, రాజారెడ్డి గుర్తుకువస్తారు. ఆ దంపతులు కూచిపూడిని విశ్వవ్యాప్తం చేస్తుంటే, ఈ దంపతులు భరతనాట్యానికి మువ్వలుగా సందడి చేస్తున్నారు. ‘‘నేను శాంతను తొలిసారి చూసింది ‘కళాక్షేత్ర’లోని థియోసాఫికల్ గార్డెన్లో. అసలు కళాక్షేత్రలో నేను కలిసిన అమ్మాయి తనే. నాకు తమిళ్ రాకపోవడంతో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధతో నన్ను గైడ్ చేస్తుండేది. శాంతలో నాకు నచ్చిన లక్షణాలు చాలా ఉన్నాయి. తానెప్పుడూ ఏదో ఒక పనిలో ఉండేది. అయినా ముఖం మీద చిరునవ్వు చెరిగేది కాదు’’78 ఏళ్ల ధనుంజయన్ 74 ఏళ్ల శాంత గురించి చెప్పిన మాటలివి. వారిది అన్యోన్యమైన దాంపత్యం. వారి ప్రేమ అపూర్వం. వారి నాట్యరీతులు అమోఘం. యాభై ఏళ్లుగా వారిద్దరూ భరతనాట్యంలో ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. దేశవిదేశాల్లో దశాబ్దాలుగా వారి పాదాలు నర్తిస్తూనే ఉన్నాయి. ధనుంజయన్ది కేరళలోని కన్నూరు జిల్లాలో పయ్యనూర్. తండ్రి స్కూల్ టీచర్. అసలే పేద కుటుంబం, ఎనిమిది మంది సంతానాన్ని పోషించడానికి ఆయన జీతం సరిపోయేది కాదు. రెండు మూడేళ్లకోసారి బదిలీ. ఒక చోట కుదురుగా లేని బాల్యం ధనుంజయన్ది. శాంతది మలేసియాలో స్థిరపడిన మలయాళీ కుటుంబం. నాట్యంలో, గానంలో చురుగ్గా ఉండేది. భరత నాట్యమంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఎనిమిదేళ్ల వయసులో డాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరినీ కలిపింది తమిళనాడులోని కళాక్షేత్ర నాట్యకేంద్రం. ధనుంజయన్కి భరతనాట్యం మీద ఉన్న ఆసక్తిని గమనించిన నాట్యగురువు కళాక్షేత్రకు రికమండ్ చేసి స్కాలర్‌షిప్‌తో సీటిప్పించారు. అలా ధనుంజయన్ పధ్నాలుగేళ్ల వయసులో కళాక్షేత్రలో అడుగుపెట్టారు. అప్పటికి ఓ ఏడాది ముందే శాంత.. కళాక్షేత్రలో చేరింది. నాట్య బంధం! నాట్య గురువులు చందు పణిక్కర్, రుక్మిణీదేవిల శిక్షణలో ధనుంజయన్, శాంతలు రాముడు –సీత అయ్యారు, అనిరుద్ధ– చంద్రలేఖలయ్యారు. ‘‘మా తొలి ప్రదర్శన సీతా స్వయంవరం. 1956లో కోయంబత్తూరులో ఇచ్చాం’’ అని ధనుంజయన్ గుర్తు చేసుకున్నారు. ‘ఆ నాట్యప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న స్టూల్ మీద చాలా సన్నిహితంగా కూర్చోవాల్సి వచ్చేది. అప్పుడు చాలా ఎంబరాసింగ్‌గా ఫీలయ్యాను. ఆ తర్వాత అదే స్టూల్ని ఇష్టంగా వాడేవాళ్లం’ అని గుర్తు చేసుకున్నారు శాంత. పేదరికం ప్రేమను చంపేస్తుందా? ధనుంజయన్, శాంత ఇద్దరూ భరతనాట్యం, కథాకళిలో డిస్టింక్షన్లో పాసయ్యి 1962లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. వీటితోపాటు ఆమె కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. శాంత కోర్సు పూర్తయిన తర్వాత మలేసియాకు వెళ్లిపోయారు. ధనుంజయన్కి మిగిలింది సస్పెన్సే. అప్పటికీ ఆయన తన ఫీలింగ్స్‌ని బయట పెట్టనేలేదు. తనలో మొగ్గతొడిగిన ప్రేమ.. ప్రేయసికి తెలియజేయకుండానే వడలిపోతుందా అని బెంగ. పేదరికం తన ప్రేమను చంపేస్తుందేమోనని ఆందోళన. ఇక్కడ ఇలా ఉంటే... మలేసియాలో శాంతకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు! ధనుంజయన్ని తప్ప ఎవరినీ తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగాలేదామె. పెళ్లి చూపులు వద్దంటూ ఉండడంతో ఆమె పేరెంట్స్ అర్థం చేసుకుని ఇండియాకు వచ్చారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో 1966లో ధనుంజయన్‌కు, శాంతకు పెళ్లి చేశారు. శాంత.. భర్తతో కేరళలోనే ఉండిపోయింది, తల్లిదండ్రులు మలేసియాకి వెళ్లిపోయారు. పెళ్లి సరే... బతికేదెలా?! చేతిలో డాన్స్‌తోపాటు ఎకనమిక్స్‌లో పట్టా ఉంది. ఓ చిన్న కంపెనీలో క్లర్కు ఉద్యోగం వచ్చింది. అమ్మానాన్నలకు పంపించడానికి, తన ఇంటిని నడిపించడానికి ఒక భరోసా వచ్చింది. కానీ సంపన్న కుటుంబంలో పుట్టిన భార్యకు కనీస వసతులు కల్పించాలంటే ఆ జీతం ఏ మాత్రం సరిపోదు. అందుకే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డాన్సు క్లాసులు తీసుకునేవారు ధనుంజయన్. తాటాకు కప్పుతో చిన్న పాకలో ఆయన నాట్యగురువుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. క్రమంగా తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వారి డాన్స్ ఇన్స్టిట్యూట్ ‘భారత కళాంజలి’కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోకి వెళ్లిపోతూ, ‘‘శాంతను సంతోషంగా ఉంచడం మీదనే నా దృష్టి అంతా. వాళ్ల తల్లిదండ్రులది ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి నా కోసం వచ్చింది. ఆమె మాత్రం ఎటువంటి సౌకర్యాలనూ అడిగేది కాదు. అయినా ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు శాంతకు రాకుండా చూడడం నా బాధ్యత అన్నట్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించేవాడిని. ఆమె ముందుచూపుతో మేము ఏర్పరుచుకున్న సామ్రాజ్యం ఇది’’ అంటారు ధనుంజయన్. నాట్య ప్రయోగాలు! భార్యాభర్తలిద్దరూ అప్పటి వరకు తాము నేర్చుకున్న నాట్యరూపకాలను ప్రదర్శించడంతో కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత కొత్త రూపకాలను పరిచయం చేశారు. నాట్యంలో యుగళగీతాన్ని ప్రవేశపెట్టారు. సంప్రదాయ అలరిప్పు స్థానాన్ని వారి ‘కళాంజలి’ పరిపూర్ణం చేసింది. ఆ దంపతుల అభినయం ‘నృత్యోపహారమ్’ రూపకాన్ని ఆవిష్కరించింది. వాటిని ఎల్లలు దాటించి విదేశాల్లోనూ వందలాదిగా ప్రదర్శించారు. మనదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకూ తాము రూపొందించిన కొత్త రీతులను చూపించారు. ఖజురహో ఫెస్టివల్, రాష్ట్రపతి భవన్లో... ఇలా వేలాది ప్రదర్శనలు, లక్షలాది ప్రశంసలను అందుకున్నారు. పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు పదులకొద్దీ అవార్డులు వారి సొంతమయ్యాయి. ఇన్ని ప్రశంసలలో తమను అత్యంత మురిపించిన ప్రశంస అమెరికాలోని అట్లాంటాలో ఏడేళ్ల బాలుడు తమకు ఇచ్చిందేనని అంటారు. ధనుంజయన్. నాట్యమే ఊపిరి! నాట్య ప్రదర్శనలు మొదలు పెట్టి యాభై ఏళ్లు దాటినా ఇంకా ఈ దంపతులలో ఆ స్ఫూర్తి ఏ మాత్రం తరగలేదు. ‘నాట్యం చేయకపోతేనే నిస్సత్తువ ఆవరిస్తుంది. నాట్యాన్ని శ్వాసిస్తూ జీవించాం, శ్వాస ఆగే వరకు నాట్యం చేస్తూనే ఉంటాం’ అన్నారు ధనుంజయన్. ‘నాట్యంలో శిఖరాలను చూసిన ఆనందాన్ని అనంతంగా ఆస్వాదిస్తున్నాం. ఇక మేము చేయాల్సిన పెద్ద బాధ్యత ఒకటుంది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోసం పెద్ద థియేటర్ నిర్మించాలి. సాంస్కృతిక నగరం చెన్నైలో నిత్యం కొత్త కళాకారులు పుట్టుకొస్తూనే ఉంటారు. వారికి ప్రదర్శనలకు అనువుగా ఒక వేదిక కావాలి. అది పూర్తయితే భరతనాట్యానికి మా వంతుగా తిరిగి ఇచ్చిన వాళ్లమవుతాం’ అన్నారు శాంత. వొడాఫోన్ కపుల్ ధనుంజయన్, శాంత దంపతులకు సత్యజిత్ ఒక్కడే కొడుకు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అదే రంగంలో కొనసాగాడు. కొడుకు సరదా కోసం వాళ్లు గోవాలో చిత్రీకరించిన వొడాఫోన్ అడ్వర్టయిజ్మెంట్లో నటించారు. అందులో ఈ దంపతులు సెకండ్ హనీమూన్కొచ్చిన కపుల్ అన్నమాట. అది డాన్సు ప్రధానంగా ఉన్న యాడ్ కావడంతో చేయడానికి ఒప్పుకున్నారు శాంత. ఆ తర్వాత మరో ఐదు యాడ్ ఫిల్మ్స్‌లో నటించినప్పటికీ వొడాఫోన్ యాడ్ తనకు చాలా ఇష్టమంటారు శాంత. ఆమె స్వతహాగా కూడా అడ్వంచర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడతారు. పారాసైలింగ్ ఆమె హాబీ. ఆ యాడ్‌లో ఆమె పారాసైలింగ్ చేశారు కూడా. అందుకే ఆ యాడ్‌ను అంతగా ఇష్టపడతారు. – మంజీర -
లంచం తీసుకున్న ఖాకీపై వేటు
హాక్-ఐ ద్వారా ఫిర్యాదు చేసిన జర్నలిస్టు సస్పెండ్ చేసిన పోలీసు కమిషనర్ సిటీబ్యూరో: ‘‘వాహనదారుల నుంచి లంచం తీసుకుంటాం..మీకేంటీ నొప్పి’’ అంటూ నడిరోడ్డుపై జర్నలిస్టుపై దౌర్జనం చేసిన పంజ గుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ ధనుంజయను నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సస్పెండ్ చేశారు. వివరాలు... జనవరి 22న పంజగుట్ట ట్రా ఫిక్ పోలీసుస్టేషనకు చెందిన కానిస్టేబుల్ ధనుంజయ రాజ్‌భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. నగ దు రహిత చలానా విధానం అమలులో ఉన్నా..అవేమీ పట్టని దనుంజ య.. వచ్చిపోయే కార్లను తనిఖీ చేస్తూ.. అందిన కాడికి డబ్బు వసూ లు చేసుకొని జేబులో వేసుకుంటున్నాడు. ఈ దృశ్యం సైదాబాద్‌కు చెందిన జర్నలిస్టు జావెద్ కంట పడింది. వెంటనే తన సెల్ఫోన్లో ధనుంజ య వాహనదారుల నుంచి లంచం తీసుకున్న దృశ్యాలను చిత్రీకరించారు. ఇది గమనించిన కానిస్టేబుల్ ‘‘ వాహనదారుల నుంచి లంచం తీసుకుంటే నీకేంటి నొప్పి’ అంటూ జావెద్ ను దూషించి, దౌర్జన్యం చేశాడు. ధనుం జయ లంచం తీసుకున్న దృ శ్యాలను జావెద్ హాక్-ఐ యాప్ ద్వా రా నగర పోలీసు కమిషనర్‌కి ఫిర్యా దు చేశాడు. దీనిపై కమిషనర్ పంజ గుట్ట ఏసీపీకి విచారణకు ఆదేశించా రు. విచారణలో కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో అతడి ని సస్పెండ్ చేస్తూ కమిషనర్ మహేం దర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.