లంచం తీసుకున్న ఖాకీపై వేటు
హాక్-ఐ ద్వారా ఫిర్యాదు చేసిన జర్నలిస్టు
సస్పెండ్ చేసిన పోలీసు కమిషనర్
సిటీబ్యూరో: ‘‘వాహనదారుల నుంచి లంచం తీసుకుంటాం..మీకేంటీ నొప్పి’’ అంటూ నడిరోడ్డుపై జర్నలిస్టుపై దౌర్జనం చేసిన పంజ గుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ ధనుంజయను నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సస్పెండ్ చేశారు. వివరాలు... జనవరి 22న పంజగుట్ట ట్రా ఫిక్ పోలీసుస్టేషనకు చెందిన కానిస్టేబుల్ ధనుంజయ రాజ్‌భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. నగ దు రహిత చలానా విధానం అమలులో ఉన్నా..అవేమీ పట్టని దనుంజ య.. వచ్చిపోయే కార్లను తనిఖీ చేస్తూ.. అందిన కాడికి డబ్బు వసూ లు చేసుకొని జేబులో వేసుకుంటున్నాడు. ఈ దృశ్యం సైదాబాద్‌కు చెందిన జర్నలిస్టు జావెద్ కంట పడింది. వెంటనే తన సెల్‌ఫోన్‌లో ధనుంజ య వాహనదారుల నుంచి లంచం తీసుకున్న దృశ్యాలను చిత్రీకరించారు.
ఇది గమనించిన కానిస్టేబుల్ ‘‘ వాహనదారుల నుంచి లంచం తీసుకుంటే నీకేంటి నొప్పి’ అంటూ జావెద్ ను దూషించి, దౌర్జన్యం చేశాడు. ధనుం జయ లంచం తీసుకున్న దృ శ్యాలను జావెద్ హాక్-ఐ యాప్ ద్వా రా నగర పోలీసు కమిషనర్‌కి ఫిర్యా దు చేశాడు. దీనిపై కమిషనర్ పంజ గుట్ట ఏసీపీకి విచారణకు ఆదేశించా రు. విచారణలో కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో అతడి ని సస్పెండ్ చేస్తూ కమిషనర్ మహేం దర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.