సాక్షి, హైదరాబాద్ : గూడ్స్ ఆటో డ్రైవర్ వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. అప్జల్ గంజ్ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్స్ ముఖేష్, సురేష్ ఆదివారం గూడ్స్ ఆటో డ్రైవర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయం సీపీ అంజనీ కుమార్ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు. అలాగే పర్యవేక్షణా లోపం కారణంగా అఫ్జల్‌గంజ్ సీఐకి చార్జ్ మెమో జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment