భైరవగీత కహానీ ఏంటి? | Bhairava Geetha first look release | Sakshi
Sakshi News home page

భైరవగీత కహానీ ఏంటి?

Sep 1 2018 4:45 AM | Updated on Sep 1 2018 4:45 AM

Bhairava Geetha first look release - Sakshi

ధనంజయ, ఇర్రా

ధనంజయ, ఇర్రా ముఖ్య తారలుగా సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘భైరవగీత’. దర్శక– నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో భాస్కర్‌ రాశి నిర్మించారు.  ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని రామ్‌గోపాల్‌ వర్మ రిలీజ్‌ చేశారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుని రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ట్రైలర్‌ను నటుడు శివరాజ్‌కుమార్‌ రిలీజ్‌ చేయనున్నట్లు రామ్‌గోపాల్‌ వర్మ వెల్లడించారు. ఇంతకుముందు ‘బాక్సర్, జెస్సీ, తగరు’ వంటి కన్నడ చిత్రాల్లో ధనంజయ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement