నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు | Actor Adivi Sesh Speech At HAROMHARA Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు

Published Thu, Jun 13 2024 4:18 AM | Last Updated on Thu, Jun 13 2024 4:50 AM

Actor Adivi Sesh Speech At HAROMHARA Movie Pre Release Event

– హీరో అడివి శేష్‌

‘‘హరోం హర’ ట్రైలర్‌ చాలా నచ్చింది. సుధీర్‌బాబు మంచి సినిమా చేశాడని తెలిసి, ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్స్‌ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్‌కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని హీరో అడివి శేష్‌ అన్నారు. 

సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌పై సుమంత్‌ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హీరోలు అడివి శేష్, విశ్వక్‌ సేన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్‌ (టీజర్, ట్రైలర్, ΄ాటలు...) ్ర΄ామిసింగ్‌గా ఉంది. 

సుబ్రహ్మణ్యం, సుమంత్‌ లాంటి ΄్యాషన్‌ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ‘హరోం హర’ లాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. నాతో ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్‌కి థ్యాంక్స్‌. 

ఈ సినిమా చూశాక ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం’’ అన్నారు నిర్మాత సుమంత్‌. ‘‘హరోం హర’లోని తండ్రీ కొడుకుల ఎమోషన్‌ నాకు చాలా కనెక్ట్‌ అయ్యింది’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర్‌ ప్రసాద్, బెక్కం వేణుగో΄ాల్,  డైరెక్టర్‌ మారుతి, డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి తదితరులు మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement