సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విశేష ఆదరణ సొంతం చేసుకొని టాప్ 1లో నిలిచింది. దేశవ్యాప్తంగా టాప్1లో ఉన్నట్లు తెలుపుతూ అమెజాన్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
హరోంహర కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు.
ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్‌కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్‌కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment