
తెలుగులో బోలెడు మంది హీరోలు. వీళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఉంటుంది. చిరంజీవికి మెగాస్టార్, మహేశ్ బాబుకి సూపర్ స్టార్, అల్లు అర్జున్‌కి ఐకాన్ స్టార్.. ఇలా దాదాపు స్టార్ హీరోలు చాలామందికి పేరుకి ముందు ఏదో ఓ ట్యాగ్ ఉంటుంది. కానీ కొందరు యంగ్ హీరోలు కూడా ఇలా ట్యాగ్స్ కోసం తెగ తాపత్రయ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు కూడా అలానే కొత్తగా ట్యాగ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి.
(ఇదీ చదవండి: ‘హరోం హర’ మూవీ రివ్యూ)
స్టార్ హీరోలు పెట్టుకున్న ట్యాగ్ గురించి పెద్దగా కంప్లైంట్స్ ఉండవు గానీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఎవరైనా ట్యాగ్స్ పెడితే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మహేశ్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా వంక పెట్టడానికేం లేదు. కానీ హిట్ మాత్రం దక్కట్లేదు. ఇప్పుడు పూర్తిగా మాస్‌ని నమ్ముకుని 'హరోం హర' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. కానీ 'పుష్ప', 'కేజీఎఫ్' సినిమాల పోలికలు మరీ ఎక్కువైపోయావని అంటున్నారు.
ఈ సినిమా ముందు వరకు 'నైట్రో స్టార్' అని పెట్టుకున్న సుధీర్ బాబు.. 'హారోంహర' కోసం 'నవ దళపతి' అని ట్యాగ్ మార్చుకున్నాడు. దళపతి అనగానే మనకు తమిళ హీరో విజయ్ గుర్తొస్తాడు. 'లియో' మూవీ టైటిల్ కార్డ్స్ లో విజయ్ కి పడ్డట్లే ఈ చిత్రంలో ఫొటోలు దాదాపు అలానే పడ్డాయి. దీంతో విజయ్-సుధీర్ బాబు ఫొటోలతో సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే 'హరోంహర'లో సుధీర్ బాబుతో పాటు సునీల్, మాళవిక శర్మ కీలక పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)
Perfect mass ComeBack Anna🙌🏻🔥
After a long waittt🥵
NAVA DHALAPATHY🔥🔥🔥@isudheerbabu #Haromhara #Sudheerbabu #Maheshbabu pic.twitter.com/kbLH3zMDw7— KritiSam❤️ (@kritisam7) June 14, 2024
Comments
Please login to add a commentAdd a comment