– సుధీర్‌బాబు
‘‘నాకు కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమే. కానీ హీరో కోసం కథలో ప్రత్యేకమైన కమర్షియల్ అంశాలు ఉండకూడదు. కథలో నుంచి హీరో పుట్టాలి. అలాంటి కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతాను . ‘హరోం హర’ ఈ తరహా చిత్రమే. తెలుగు సినిమాలోని మొదటి పది యాక్షన్ సినిమాల్లో ఎప్పటికీ ‘హరోం హర’ ఉంటుందని నమ్ముతున్నాను. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అని సుధీర్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు.
⇒ ఈ చిత్రంలో నా ΄ాత్ర పేరు సుబ్రహ్మణ్యం. కుప్పంలోని ఓ మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం. అక్కడో సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటి? సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్‌లోకి రావాల్సి వచ్చింది? అన్నదే ఈ చిత్రకథ. కథలో కొన్ని లేయర్స్ ఉన్నాయి. అందులో మైథాలజీ అంశాలు కూడా ఉన్నాయి. నాకు తెలుగు భాష వచ్చు కాబట్టి కుప్పం యాసలో డైలాగ్స్ చెప్పడం పెద్దగా కష్టం అనిపించలేదు.
⇒ జ్ఞానసాగర్ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇంత పెద్ద కథను చేయగలడా? అనిపించింది. కానీ నాకు చెప్పిన కథను చెప్పినట్లుగా విజువల్‌గా తెరపై చూపించాడు. ఈ విషయంలో అతనికి నూటికి నూరు మార్కులు వేస్తాను. అదే విధంగా ఇటీవలి కాలంలో తెలుగులో ‘హరోం హర’లాంటి సినిమా రాలేదని నా నమ్మకం. ఈ సినిమాలో ఓ సస్పెండెడ్ ΄ోలీస్ కానిస్టేబుల్ పళని ΄ాత్రను సునీల్‌గారు చేశారు. సుబ్రహ్మణ్యంకు స΄ోర్టివ్‌గా ఉండే ΄ాత్ర ఇది. ఈ సినిమా కథ డిమాండ్ చేసిన మేరకు ఖర్చు పెట్టారు నిర్మాత సుమంత్. ‘హరోం హర’కు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. స్టోరీ లైన్ ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్‌పై స్వీకెల్ ఆధారపడి
ఉంటుంది.
⇒ జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్‌కి చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన ఊర్లో ఉంటే, మన పక్కింటి కుర్రాడు గన్స్ తయారు చేయాల్సి వస్తే కొంచెం నాటుగా ఉంటుంది. అందుకే ‘హరోం హర’ సినిమాను జేమ్స్ బాండ్ బ్యాక్‌డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు.
⇒ సూపర్‌స్టార్ కృష్ణగారు నన్ను మాస్ యాక్షన్ మూవీలు చేయమని చెప్పేవారు. ఆయన మంచి మాస్ హీరో. గతంలో నేను చేసినవి చాలావరకు క్లాస్ చిత్రాలు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ‘హరోంహర’ నేను చేసిన మంచి యాక్షన్ మూవీ అని నమ్మకంగా చూపించేవాడిని.
⇒ నా గత చిత్రాల్లో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. అవి ‘హరోం హర’ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకున్నానని అనుకుంటున్నాను. నా ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్నిసార్లు మనం ఊహించిన ఫలితాలు రాక΄ోవచ్చు. కానీ ఏదో ఒక మోటి వేషన్‌ను తీసుకుని ముందుకు వెళ్తుంటాను.
Comments
Please login to add a commentAdd a comment