టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం 'హరోం హర'. యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా గతనెల 14న విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఆగష్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఆహా ప్రకటించి మళ్లీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ ఎక్స్ పేజీ వేదికగా కొత్త తేదీని ప్రకటించింది.
'హరోం హర' మూవీని నేడు (జులై 15) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆహా తెలుగు వెల్లడించింది. యాక్షన్ ప్యాక్డ్ మండే మూవీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. నేడు సాయంత్రం 5 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న హరోం హర సినిమాను మిస్ కావద్దంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.
డార్క్ కామెడీ పేరుతో పలు వీడియోల వల్ల వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కూడా 'హరోం హర' సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ వల్ల అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆహా ఓటీటీ సంస్థ సినిమా విడుదలను ఆపేసింది. అతడు నటించిన సీన్లను తొలగించి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment