మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలుగు సినీ పెద్దలు శనివారం సమావేశం అయ్యారు. టాలీవుడ్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై మంత్రితో చర్చించారు.ఈ సమావేశం అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్‌ను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. టాలీవుడ్‌లో జరుగుతున్న వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. 'మా' సభ్యత్వంపై వివాదాలు వెల్లువెత్తుతుండటంతో ఇక చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని, అలాగే నటులకు నిర్మాతలే నేరుగా పారితోషికం ఇవ్వాలని, కోఆర్డినేటర్లు లేకుండా మేనేజర్ ద్వారానే నేరుగా బ్యాంకు ఖతాలకు చెల్లింపులు జరిపేలా చూడాలని ఆయన సూచనలు చేశారు. ఇక మీడియాపై దాడి చేయడాన్ని మంత్రి తలసాని ఖండించారు.