
సాక్షి, హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ‘మా’ఉపాధ్యక్షుడు రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం స్థానిక హోటల్‌లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన రాజశేఖర్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలత చెందిన ఆయన ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్ కారణమని, ‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పట్నుంచి అతడి తీరు అస్సలు బాగోలేదని, అంతేకాకుండా అతడితో తమకు పొసగడంలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
గురువారం ‘మా’ పలు నాటకీయ, ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘మా’లో మారోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఆయన నుంచి మైకు లాక్కొన్నాడు. దీంతో వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబులకు ఆగ్రహం తెప్పించింది. దీనికి తోడు రాజశేఖర్ మాట్లాడిన తీరు, అంశాలపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని పనిగట్టుకుని గొడవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చారని రాజశేఖర్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి విమర్శించారు. అంతేకాకుండా ‘మా’నియమనిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మోహన్ బాబు, కృష్ణంరాజు చిరంజీవికి సపోర్ట్ నిలుస్తూ రాజశేఖర్ చేసిన పనిని తప్పుపట్టారు. అంతేకాకుండా జీవితరాజశేఖర్ సైతం తన భర్తది చిన్నపిల్లల మనస్తత్వంగా పేర్కొనడం విశేషం.
చదవండి:
‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్
‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment