మార్పు కోసమే మేం వచ్చాం: నాగేంద్రబాబు | we want change.. thats why we came: nagendrababu | Sakshi
Sakshi News home page

మార్పు కోసమే మేం వచ్చాం: నాగేంద్రబాబు

Published Sun, Mar 29 2015 11:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

మార్పు కోసమే మేం వచ్చాం: నాగేంద్రబాబు - Sakshi

మార్పు కోసమే మేం వచ్చాం: నాగేంద్రబాబు

హైదరాబాద్: మార్పు కోసమే తాము ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చినట్లు ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు అన్నారు. గతంలో ఎప్పుడూ చూసినా యూనానిమస్ అంటూ ఒకరికే కట్టబెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడా పరిస్థితిలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు. ఆదివారం రసవత్తరంగా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో ప్రధానంగా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ కు మద్దతిస్తున్న నాగేంద్రబాబు మాట్లాడుతూ యూనానిమస్ కారణంగా గతంలో చిన్న చిన్న ఆర్టిస్ట్లు మా అసోసియేషన్ వైపు రాలేకపోయారని, నేడు రాజేంద్రప్రసాద్ ముందుకొచ్చి పోటికి దిగినందున చాలామంది కామన్ ఆర్టిస్ట్లు ముందుకొచ్చి తమ ఓటును వేస్తున్నారని, మంచి వాతావరణం నెలకొందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement