Nagendrababu
-
నిలకడగా నాగేంద్రబాబు ఆరోగ్యం
సాక్షి, గుంటూరు: దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు అనంతరం ఆత్మహత్యకు యత్నించి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కడుపులో పేగులకు అయిన గాయాలకు ఆపరేషన్ చేసిన అనంతరం వైద్యులు నాగేంద్ర బాబును పోస్టు ఆపరేటివ్ ఐసీయూ వార్డుకు మార్చారు. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్ఎంఓ సతీష్ ఆదివారం తెలిపారు. నాగేంద్రబాబు గాయపడి 48 గంటలు దాటిందని, కొంతమేరకు కోలుకున్నాడని వెల్లడించారు. సోమవారం అతని ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులు పరీక్షించిన అనంతరం తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు. ('7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో') -
దారి దోపిడీ కలకలం
పల్సర్‌లో వచ్చి.. కత్తులు చూపించి.. 3 సెల్ఫోన్లు, రూ.11వేల నగదు, 4 తులాల బంగారు అపహరణ చిలమత్తూరు : దేమకేతేపల్లి గ్రామపంచాయతీలోని యగ్నిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో దారిదోపిడీ జరిగింది. ముగ్గురు సభ్యులు గల ముఠా మారణాయుధాలు చూపి సెల్ఫోన్లు, నగలు, నగదు దోచుకుని బైక్‌పై ఉడాయించింది. ఈ ఘటన కలకలం రేపింది. కొత్త చామలపల్లికి చెందిన నాగేంద్రబాబు తన చిన్నాన్న చలపతి కుమార్తె శ్వేత వివాహం ఆదివారం కనుమలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉండటంతో శనివారం సాయంత్రమే అక్కడకు చేరుకున్నాడు. అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో యగ్నిశెట్టిపల్లిలోని చుట్టాల ఇంటికి బంధువులు అనసూయమ్మ, నాగమణిలను పిలుచుకుని ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు పల్సర్ (కేఏ 04హెచ్ఎక్స్ 2806)బైక్‌లో ఓవర్ టేక్ చేసి నాగేంద్రబాబును అటకాయించారు. కత్తులతో బెదిరించి నాగేంద్రబాబు, అతని బంధువుల వద్ద గల మూడు సెల్ఫోన్లు, రూ.11 వేల నగదు, 4 తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లారు. దుండగుల బైక్ పట్టుబడిందిలా.. కనుమలోని వివాహ మండపం వద్దకు చేరుకున్న బాధితుడు నాగేంద్రబాబు అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ జమాల్‌బాషా, పోలీసులు కనుమ వద్దకు చేరుకుని బాధితులకు చెందిన మూడు సెల్ నంబర్లకు ఫోన్ చేయగా బ్రహ్మేశ్వరంపల్లి గ్రామస్తులు ఓ నంబర్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గ్రామంలో అనుమానాస్పదంగా వాహనంపై వెళ్తుంటే ఆపామని, వారు బైక్‌ను వదిలి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారని, ఆ సమయంలో సెల్ ఫోన్ కింద పడిపోయిందని పోలీసులకు వివరించారు. గ్రామానికి చేరుకున్న ఎస్ఐ స్థానికుల సహాయంతో అర్ధరాత్రి 12 గంటల వరకు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
అక్టోబర్ 29 ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: నాగేంద్రబాబు (నటుడు), వరుణ్ ఆరోన్ (క్రికెటర్) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. వీరి పుట్టిన తేదీ 29. ఇది చంద్ర కుజుల కలయిక వల్ల ఏర్పడిన సంఖ్య. ఈ తేదీలో పుట్టిన వారికి 29 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో వృద్ధి, విదేశీ యానం ఉంటుంది. రాజకీయాలలో ఉన్న వారికి తగిన పదవి, గుర్తింపు లభిస్తాయి. అయితే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఆ ప్రతిపాదనలు విరమించుకోవడం మంచిది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వ్యతిరేకులు సైతం మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. పూర్వికుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొంటుంది. భర్త ఆస్తిలో వాటా లేదా మనోవర్తి కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ ఏడాది తప్పక లాభిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు చేయడం వల్ల విజయం సాధించగలుగుతారు. లక్కీ నంబర్స్: 1,2,4,6,8; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, బ్లూ, ఎల్లో, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు; సూచనలు: రోజూ కాసేపు వెన్నెలలో విహరించడం, చంద్రకాంతమణిని లేదా ముత్యాన్ని ధరించడం, శివుడికి అభిషేకం చేయడం, వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయటం, ఆల యాలు, దర్గాలు, చర్చిలలో పాయసం లేదా ఇతర తీపి పదార్థాలు పంచిపెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
మార్పు కోసమే మేం వచ్చాం: నాగేంద్రబాబు
-
మార్పు కోసమే మేం వచ్చాం: నాగేంద్రబాబు
హైదరాబాద్: మార్పు కోసమే తాము ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చినట్లు ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు అన్నారు. గతంలో ఎప్పుడూ చూసినా యూనానిమస్ అంటూ ఒకరికే కట్టబెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడా పరిస్థితిలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు. ఆదివారం రసవత్తరంగా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ కు మద్దతిస్తున్న నాగేంద్రబాబు మాట్లాడుతూ యూనానిమస్ కారణంగా గతంలో చిన్న చిన్న ఆర్టిస్ట్‌లు మా అసోసియేషన్ వైపు రాలేకపోయారని, నేడు రాజేంద్రప్రసాద్ ముందుకొచ్చి పోటికి దిగినందున చాలామంది కామన్ ఆర్టిస్ట్‌లు ముందుకొచ్చి తమ ఓటును వేస్తున్నారని, మంచి వాతావరణం నెలకొందని అన్నారు. -
పవర్ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని మోసం
విశాఖపట్నం: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పవర్ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని విశాఖకు చెందిన వ్యక్తిని మోసం చేశాడు. 4వ టౌన్ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన అగర్వాల్ అనే వ్యక్తి నాగాలాండ్‌లో పవర్ ప్రాజెక్టు కోసం మిలియన్ డాలర్ల రుణం ఇప్పిస్తానని ఇక్కడి నాగేంద్ర బాబుని నమ్మించాడు. అగర్వాల్ కోరిన ప్రకారం నాగేంద్రబాబు ఎస్బిఐ ఆన్లైన్ ద్వారా 5లక్షల రూపాయలు పంపాడు. మళ్లీ అతని నుంచి ఎటువంటి సమాచారంలేదు. ఫోన్‌కు అందుబాటులో లేడు. దాంతో నాగేంద్రబాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ** -
కోటే కుటుంబానికి ‘చిరు’ సాయం
బెంగళూరు: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాద సంఘటనలో సజీవ దహనమైన కోటే వెంకటేశ్ యాదవ్ కుటుంబానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేసింది. బెంగళూరులో సోమవారం నిర్వహించిన కోటే పెద్దకర్మలో నటుడు నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కోటే అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తమపై చూపిన అభిమానాన్ని మరువలేమన్నారు. వెంకటేశ్ కుమార్తెలు ఇద్దరికి రూ. 3 లక్షలు, వెంకటేశ్ భార్య శాంత, కోటే తండ్రి సుందర్‌రాజ్‌లకు రాంచరణ్, అల్లు అర్జున్ అందించిన రూ. లక్ష డీడీలను అందజేశారు.