ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పవర్ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని విశాఖకు చెందిన వ్యక్తిని మోసం చేశాడు.
విశాఖపట్నం: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పవర్ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని విశాఖకు చెందిన వ్యక్తిని మోసం చేశాడు. 4వ టౌన్ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన అగర్వాల్ అనే వ్యక్తి నాగాలాండ్లో పవర్ ప్రాజెక్టు కోసం మిలియన్ డాలర్ల రుణం ఇప్పిస్తానని ఇక్కడి నాగేంద్ర బాబుని నమ్మించాడు.
అగర్వాల్ కోరిన ప్రకారం నాగేంద్రబాబు ఎస్బిఐ ఆన్లైన్ ద్వారా 5లక్షల రూపాయలు పంపాడు. మళ్లీ అతని నుంచి ఎటువంటి సమాచారంలేదు. ఫోన్కు అందుబాటులో లేడు. దాంతో నాగేంద్రబాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
**