అగ్ర హీరోలు రాకుంటే జయసుధ గల్లంతేనట! | jayasudha will loose maa election.. if big heros didnt use vote | Sakshi
Sakshi News home page

అగ్ర హీరోలు రాకుంటే జయసుధ గల్లంతేనట!

Published Sun, Mar 29 2015 12:42 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

అగ్ర హీరోలు రాకుంటే జయసుధ గల్లంతేనట! - Sakshi

అగ్ర హీరోలు రాకుంటే జయసుధ గల్లంతేనట!

హైదరాబాద్: అగ్రహీరోలు తమ ఓటు వేసేందుకు రాకుంటే జయసుధ మా అసోసియేషన్ ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని పలువురు కామన్ ఆర్టిస్ట్లు చెప్తున్నారు.  జయసుధకు 40 ఏళ్ల నటన అనుభవం ఉందని, దాంతో ఆమె పరిచయాలు కూడా పెద్ద స్థాయిలో ఉన్నాయని, ఆ తరంనాటి హీరోలతోపాటు వారి కుటుంబంలోని నటీ నటులు కూడా ఓటును వినియోగించుకుంటేనే ఆమె గెలుపు సాధ్యం అని అన్నారు. ఆదివారం రసవత్తరంగా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్, నటి జయసుధ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొన్నటి వరకు మా అధ్యక్షుడిగా పనిచేసిన మురళీ మోహన్ జయసుధకు మద్దతు ఇవ్వగా.. రాజేంద్రప్రసాద్కు నాగేంద్రబాబులాంటివారు మద్దతిచ్చారు. దీంతో రెండు భిన్న వర్గాలుగా తెలుగు చిత్ర సీమ ఈ ఎన్నికల విషయంలో చీలినట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన నటుల్లో నాగేశ్వరరావు అనే ఆర్టిస్ట్ మాట్లాడుతూ కామన్ ఆర్టిస్ట్లే ఎక్కువగా ఓటు వేసేందుకు వస్తున్నారని, వారు రాజేంద్రప్రసాద్కే మద్దతుగా ఉన్నారని, అగ్రహీరోలు ఓటుకు రాకుంటే ఆయనదే విజయం అన్నట్లుగా అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement