తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలుగు సినీ పెద్దలు శనివారం సమావేశం అయ్యారు. టాలీవుడ్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై మంత్రితో మంత్రితో చర్చించారు. సచివాలయంలోని మంత్రి తలసాని ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు శంకర్, నటి జీవితా రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సి కళ్యాణ్, మా అధ్యక్షుడు శివాజీ రాజా, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రామ్మోహన్ రావు, హోం సెక్రటరీ రాజీవ్ త్రివేది తదితరులు పాల్గొన్నారు.