మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను ఎప్పుడూ కృషి చేస్తానని ప్రముఖ సినీ నటి జయసుధ అన్నారు.
పిఠాపురం (తూర్పుగోదావరి): మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను ఎప్పుడూ కృషి చేస్తానని ప్రముఖ సినీ నటి జయసుధ అన్నారు. ఆమె శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లిలో ప్రఖ్యాతి గాంచిన జాంధానీ చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. నటీనటులందరూ సహకరించినా టెక్నీషియన్లు కొందరు సహకరించకపోవడం వల్ల తాను ఓటమి పాలయ్యామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అయినప్పటి కీ ‘మా’ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తానన్నారు. ఉప్పాడ జాంధానీ చీరలు చాలా అందంగా ఉన్నాయని, మంచి నాణ్యతతో ఉండడం వల్లే వీటికి ఇంత పేరు వచ్చిందని అన్నారు.