శివాజీ, హేమ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం: జయసుధ | that coments their personel: jayasudha | Sakshi
Sakshi News home page

శివాజీ, హేమ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం: జయసుధ

Published Sun, Mar 29 2015 9:35 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

శివాజీ, హేమ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం: జయసుధ - Sakshi

శివాజీ, హేమ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం: జయసుధ

హైదరాబాద్: మా ఎన్నికల సందర్భంగా నటుడు శివాజీరాజా.. హేమ పరస్పరం విరుద్ధంగా చేసుకున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం అని మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటి జయసుధ అన్నారు. సాధారణ ఎన్నికలు తలపించే తీరులో ఆదివారం మూవీ ఆర్ట్స్ అసోసియేషన్కు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ ఎన్నికలు తెలుగు చిత్ర సీమలోని నటులు మధ్య ఉన్న వైరుధ్యాలను ఒక్కసారిగా బయట పడేశాయి. ఈ సందర్భంగా శివాజీరాజా, హేమ వ్యాఖ్యలపై జయసుధను ప్రశ్నించగా ఆమె ఇలా స్పందించారు.  ఈ ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే తమ ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లారని, ఎవరు ఎన్నిసార్లు మీడియా సమావేశాలు పెట్టారో ఇప్పటికే మీకు తెలుసని అన్నారు. మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా సమాధానం దాటవేసి వెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement