అమెరికాలో మా వేడుకలు | Shivaji Raja speech at MAA Silver Jubilee Celebrations | Sakshi
Sakshi News home page

అమెరికాలో మా వేడుకలు

Published Wed, Feb 14 2018 1:15 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Shivaji Raja speech at MAA Silver Jubilee Celebrations  - Sakshi

నరేష్, శివాజీరాజా, శ్రీకాంత్‌

మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకలను ఏప్రిల్‌ 28న అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘ఫిల్మ్‌ స్టార్‌ ఈవెంట్స్‌– తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తగా అమెరికాలో ఈ వేడుక నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవిగారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మే నెలలో జరిగే ఓ ఈవెంట్‌కు మహేశ్‌బాబు వస్తానన్నారు. హీరోయిన్లు కచ్చితంగా ‘మా’లో మెంబర్‌షిప్‌ తీసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే ‘మా’ ముందుకు వస్తున్నారు.

ఒక చేతితో ‘మా’ మెంబర్‌ షిప్‌ ఫారమ్, మరో చేతితో ఫిర్యాదు ఫారమ్‌ తీసుకొస్తున్నారు. ‘మా’ సిల్వర్‌ జూబ్లీ సందర్భంగా 35 మందికి ఈ నెల నుంచి 3000 పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అన్నారు. ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్, జనరల్‌ సెక్రటరీ నరేష్, కార్యవర్గ సభ్యుడు సురేష్, అమెరికా ఈవెంట్‌ ఆర్గనైజర్లలో ఒకరైన రాధాకృష్ణ రాజా, స్టీఫెన్‌ పల్లామ్‌ (అమెరికా), రాంబాబు కల్లూరి (అమెరికా), నిఖిల్‌ నాంచారి (అమెరికా), ‘మా’ వైస్‌ ప్రెసిడెంట్‌ బెనర్జీ, కల్చరల్‌ కమిటీ చైర్మన్‌ సురేశ్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement