
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు పోరాటం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే వివిధ పద్ధతుల్లో నిరసనలతో కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించిన ప్రత్యేక హోదా సాధన సమితి తాజాగా సినీ పరిశ్రమ మద్దతు కోరింది. ఆదివారం మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సభ్యులను హోదా సాధన సమితి ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని వారికి వివరించారు. ఈ సమావేశం అనంతరం ప్రత్యేక హోదా ఉద్యమానికి ‘మా’ సంఘీభావం తెలిపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment