హేమ కంట్రోల్లో ఉంటే మంచిది: శివాజీ రాజా | iam a fighter.. hema should be in control: shivaji raja | Sakshi
Sakshi News home page

హేమ కంట్రోల్లో ఉంటే మంచిది: శివాజీ రాజా

Published Sun, Mar 29 2015 9:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

హేమ కంట్రోల్లో ఉంటే మంచిది: శివాజీ రాజా - Sakshi

హేమ కంట్రోల్లో ఉంటే మంచిది: శివాజీ రాజా

హైదరాబాద్: నటి హేమ తనపై చేసిన వ్యాఖ్యలు తన విజ్ఞతకే వదిలేస్తున్నానని నటుడు శివాజీ రాజా అన్నారు. ఆమె కంట్రోల్లో ఉంటే బావుంటుందని చెప్పారు. మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ తరుపున పోటి చేస్తున్న ఆయన ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం హేమకు ఏముందని ప్రశ్నించారు.  వీలుంటే మంచి చేయాలని హితవు పలికారు. వారు ఓడిపోతారనే భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హేమ మీపై ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటారని అంటున్నారుగా అని ప్రశ్నించగా వారు ఏ చర్యలైనా తీసుకోవచ్చని, తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు. తాను గొప్ప పోరాటయోధుడినని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ను ఒంటరి చేయడం ఇష్టం లేకే ఓడిపోయినా సరే ఎన్నికలకు వచ్చానని అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని.. ఏదైనా ఉంటే కెమెరా ముందు నటించాలేగానీ, కెమెరా వెనుక వద్దని చెప్పారు. ఎన్నికల ప్రభావం సినిమాలో నటించడంపై పడబోదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement