
డల్లాస్ : మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు డల్లాస్‌లో జరిగాయి. ఈ ఫిల్మ్ స్టార్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓల్డేజ్ హోం నిర్మాణం కోసం నిధులు సమీకరించడానికి మా అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. షూటింగ్ సమయాల్లో అందరితో కలివిడిగా గడిపిన నటులు వృద్దాప్యంలో ఒంటరిగా ఉండకూడదని వారి కోసం ఓల్డేజ్ హోం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు మా సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీరాజా, బెనర్జీ, ఏడిగ శ్రీరాం, హేమ, శివారెడ్డి, ప్రజ్ఞా జైస్వాల్, అలీ, శ్రీకాంత్, తరుణ్, సుధీర్, ప్రిన్స్, వరుణ్ తేజ్, రెజీనా, సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, కేథరిన్, హంసా నందిని, తేజస్విని, అర్చన, నవీన్ చంద్ర, తమన్, మనీషా, ఆదిత్యాలు పాల్గొన్నారు. జాన్సీ, హరితేజ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శివారెడ్డి కామెడీ అందరిని అలరించింది.
కాగా, ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో లేదని పలువురు ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడ్డారు. ఆడిటోరియంలో చాలా వరకు సీట్లు ఖాళీగా కనిపించాయని, ఆర్గనైజర్లు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment