
సాక్షి, హైదరాబాద్ : సినిమా హీరోయిన్లు, ఇతర నటీమణుల ఫొటోలు, వీడియోలకు అసభ్యపదజాలాన్ని జోడించి అశ్లీలతను ఎగజిమ్ముతోన్న దాసరి ప్రదీప్ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు కేంద్రంగా నాలుగు అశ్లీల వెబ్‌సైట్లు నిర్వహిస్తోన్న ప్రదీప్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆదివారం హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడిని రేపు(సోమవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
30 వెబ్‌సైట్లపై ఫిర్యాదు : ఇటీవలి కాలంలో సినీ ప్రముఖుల గురించి అసభ్యకర, అభ్యంతరకర రాతలు రాస్తూ, హిట్ల ద్వారా సొమ్ములు చేసుకుంటోన్న వెబ్‌సైట్లపై సినిమా నటుల సంగం ‘మా’ ప్రభుత్వానికి ఫిర్యాదుచేసింది. ప్రధానంగా తాము గుర్తించిన 30 వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లను వెంటనే నిషేధించాల్సిందిగా కోరింది. కేసు నమోదుచేసుకుని రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర క్రైమ్ పోలీసులు.. అందరికంటే ముందు బెంగళూరు కేంద్రంగా సైట్లు నిర్వహిస్తోన్న ప్రదీప్‌ను పట్టుకున్నారు. మిగిలిన వెబ్‌సైట్ల అడ్మిన్లను కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment