
తీర్పు తర్వాతే 'మా' ఫలితాలపై స్పష్టత : మురళీమోహన్
హైదరాబాద్ : 'మా' ఫలితాలు ఎప్పుడు వెల్లడిచేస్తామన్నది మంగళవారం తెలుస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికల ఫలితాల ఎప్పుడు వెల్లడిస్తామన్న అన్న దానిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం సుమారు 150 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అగ్ర హీరోలు ఎవ్వరూ ఇప్పటివరకూ ఓటు వేయలేదని సమాచారం. 350 లోపే ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.