రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్.. మంచు విష్ణుపై పెరుగుతున్న ఒత్తిడి! | MAA Association Taken Action Against Raj Tarun On Lavanya Dispute | Sakshi
Sakshi News home page

Raj Tarun: రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్.. మా అసోసియేషన్‌ నిర్ణయంపై ఉత్కంఠ!

Published Mon, Jul 15 2024 9:20 PM | Last Updated on Tue, Jul 16 2024 8:52 AM

MAA Association Taken Action Against Raj Tarun On Lavanya Dispute

ప్రస్తుతం రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణలు, ట్విస్టులతో మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఈ అంశంలో రాజ్‌ తరుణ్‌పై మా అసోసియేషన్  చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై షోకాజ్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నట్లు సమాచారం.  ఇప్పటికే మా సభ్యులతో మంచు విష్ణు చర్చించినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అతన్ని మా నుంచి సస్పెండ్ చేయాలని  కొంత మంది సభ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది.

హేమ, ప్రణీత్ హనుమంతు విషయంలో వేగంగా స్పందించిన మంచు విష్ణు.. రాజ్ తరుణ్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి కొంత మంది మా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈడో రకం.. ఆడో రకం సినిమాలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement