Maa art association
-
మా బిల్డింగ్ గురించి రెండు నెలల్లో ప్రకటిస్తాం: మంచు విష్ణు
‘‘మేం ఏం అనుకుని వచ్చామో ఆ పనులన్నీ పూర్తి చేశాం. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) బిల్డింగ్ ఒక్కటే బాకీ ఉంది. ఈ అంశంపై కూడా రాబోయే రెండు నెలల్లో ఓ అద్భుతమైన ప్రకటన చేయబోతున్నాం’’ అని ‘మా’అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. జీవీకే హెల్త్ హబ్ అసోసియేషన్‌తో ‘మా’ ఆధ్వర్యంలో సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అధ్యక్షుడు మంచు విష్ణు, ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘జీవీకే హెల్త్ హబ్ యాజమాన్యానికి, డాక్టర్ శాస్త్రిగారితో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. ‘మా’ సభ్యులందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు’’ అని అన్నారు. ‘‘ఆదివారం వరల్డ్ హార్ట్ డే. ఆర్టిస్టులు ఎంతో ఒత్తిడితో ఉంటారు. అందుకే వీరి కోసం మాస్టర్ చెకప్ చేశాం’’ అన్నారు డా. శాస్త్రి. ‘మా’లోని సభ్యుల్లో దాదాపు నాలుగు వందల మంది ఈ హెల్త్ క్యాంప్‌లో పాల్గొని, చెకప్ చేయించుకున్నారని సమాచారం. -
భవిష్యత్తులోనూ 'మా' పోరాటం కొనసాగిస్తాం: మంచు విష్ణు
టాలీవుడ్ నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మా కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేసింది. ఇచ్చిన గడువులోగా అలాంటి వీడియోలు తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దాదాపు 20కి పైగా యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించారు.తాజాగా ఈ అంశంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అసత్య సమాచారాన్ని నియంత్రించేందుకు రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సభ్యుల సూచనలు తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సోషల్ మీడియాలో నటీనటులపై అసత్యాలు, అగౌరవ పరిచేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులోనూ ఇండస్ట్రీలో సమస్యలపై పోరాడేందుకు సభ్యుల నిబద్ధత చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. On behalf of the MAA, we are honored to support our actors. #MAA President @iVishnuManchu has addressed key issues, particularly addressing disinformation & disrespect from some content creators. We are proud of our dedicated team and their innovative ideas for the future. pic.twitter.com/xohPmWT5WD— MAA Telugu (@itsmaatelugu) July 30, 2024 -
రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్.. మంచు విష్ణుపై పెరుగుతున్న ఒత్తిడి!
ప్రస్తుతం రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణలు, ట్విస్టులతో మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ అంశంలో రాజ్ తరుణ్‌పై మా అసోసియేషన్ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై షోకాజ్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మా సభ్యులతో మంచు విష్ణు చర్చించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అతన్ని మా నుంచి సస్పెండ్ చేయాలని కొంత మంది సభ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది.హేమ, ప్రణీత్ హనుమంతు విషయంలో వేగంగా స్పందించిన మంచు విష్ణు.. రాజ్ తరుణ్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి కొంత మంది మా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈడో రకం.. ఆడో రకం సినిమాలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించారు. -
కరాటే కల్యాణిని ‘మా’ సస్పెండ్ చేయడం దారుణం
పంజగుట్ట: మానవుడి రూపం దేవుడికి ఇవ్వరాదని పోరాటం చేసిన కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని.. మా వెంటనే ఆ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని పలు యాదవ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కళ్యాణి ఎన్టీఆర్‌ను, సినీ పరిశ్రమను ఎప్పుడూ కించపరచలేదని, శ్రీ కృష్ణునికి ఎన్టీఆర్ రూపం ఇవ్వరాదనే పోరాటం చేసిందన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రామచంద్ర యాదవ్, చలకాని వెంకట్ యాదవ్‌లు మాట్లాడుతూ... భగవంతునికి మానవరూపం ఇవ్వరాదని ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తే సంబంధంలేని ‘మా’ సస్పెండ్ చేయడం సరికాదన్నారు. బలహీనవర్గాలకు చెందిన ఓ మహిళను సస్పెండ్ చేయడంతో సినీ పరిశ్రమ ఒక సామాజిక వర్గానికి చెందిందిగా అర్థం అవుతుందన్నారు. వెంటనే సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోకపోతే హైదరాబాద్‌లో ఉన్న 20 లక్షల మంది యాదవులు ఐక్యమై పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే మంచు విష్ణును కలిసి ఈ విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు. కరాటే కళ్యాణి మాట్లాడుతూ... తాను ఎన్టీఆర్‌ను ఎప్పుడూ కించపరచలేదని, తాను కూడా ఎన్టీఆర్ అభిమానినే అన్నారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ అనే కాకుండా ఎవరు పెట్టినా ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంపై ‘మా’ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే వ్యాలిడిటీ కాదు సస్పెన్షన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను ఒక యాదవ సంఘం నాయకురాలిగా మాట్లాడానన్నారు. త్వరలో సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో పోరాడతానన్నారు. సమావేశంలో మహేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్, రాధాకృష్ణ, మారుతి రామారావు, నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అది కరెక్ట్ కాదు
2019–2021 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీనియర్ నరేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఈ నెల 22న ముహూర్తం నిర్ణయించుకున్నారు నరేశ్. అయితే అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేయడానికి శివాజీ రాజా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నరేశ్. 2017–2019 కాలపరిమితికి శివాజీ రాజా ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్ ప్రమాణ స్వీకారం చేయాలంటే తన పదవీ కాలం ముగియాలని శివాజీరాజా అంటున్నారని నరేశ్ చెబుతున్నారు. ఇంకా నరేశ్ మాట్లాడుతూ– ‘‘మా’లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయటపడకుండా అందరినీ కలుపుకుపోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని పని చేయకుండా వెనక్కి లాగుతున్నారు. ఇండస్ట్రీ పెద్దల అంగీకారంతో, వారి సమక్షంలో ఈ 22న మంచి మూహుర్తం ఖరారు చేసుకుని ప్రమాణా స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం. ‘నా పదవీకాలం 31వరకు ఉంది. అప్పటి వరకు ఎవరూ మా కుర్చీలో కూర్చోవద్దు. కోర్టుకి వెళతా అని శివాజీ రాజా ఫోన్లో బెదిరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు ఎలా చెబితే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు. -
సిని'మా' ఎన్నిక సమరం