టాలీవుడ్ నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మా కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేసింది. ఇచ్చిన గడువులోగా అలాంటి వీడియోలు తొలగించకపోతే చర్యలు తప్పవని మా అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దాదాపు 20కి పైగా యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయించారు.
తాజాగా ఈ అంశంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అసత్య సమాచారాన్ని నియంత్రించేందుకు రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సభ్యుల సూచనలు తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సోషల్ మీడియాలో నటీనటులపై అసత్యాలు, అగౌరవ పరిచేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులోనూ ఇండస్ట్రీలో సమస్యలపై పోరాడేందుకు సభ్యుల నిబద్ధత చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
On behalf of the MAA, we are honored to support our actors. #MAA President @iVishnuManchu has addressed key issues, particularly addressing disinformation & disrespect from some content creators. We are proud of our dedicated team and their innovative ideas for the future. pic.twitter.com/xohPmWT5WD
— MAA Telugu (@itsmaatelugu) July 30, 2024
Comments
Please login to add a commentAdd a comment