
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేష్‌కి, రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ‘మా’తీవ్రంగా ఖండించింది. ‘ఓ అసోసియేషన్ అంటే.. చాలా సమస్యలుంటాయి. వాటన్నింటినీపై అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. `మా` వెల్ఫేర్‌కి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మంగళవారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియజేస్తాం. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి’ అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment