
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యులుగా ఉన్న చాలామంది వేషాలు లేక బాధపడుతున్నారు. వారికి అవకాశాలు కల్పించాలంటూ ‘మా’ తరఫున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర రచయితల సంఘాలకు విన్నవించాం’’ అని ‘మా’ అధ్యక్షుడు డా.వి.కె. నరేష్ అన్నారు.
మన తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలివ్వాలని, ముఖ్యంగా ‘మా’ సభ్యులై ఉండి అవకాశాలు లేని నటీనటులను ప్రోత్సహించాలని కోరుతూ ‘మా’ అధ్యక్షుడు డా.వి.కె.నరేష్, జనరల్ సెక్రటరీ జీవిత, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ హేమ, ఇతర ‘మా’ సభ్యులు నినదించారు.
ఈ మేరకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ సుప్రియ, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, తెలుగు చలన చిత్ర రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణలకు వినతి పత్రం సమర్పించారు. అలీ, రాజారవీంద్ర, ఉత్తేజ్, సురేష్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కూమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment