ప్రయివేట్ వెబ్‌సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ‘మా’ ఫిర్యాదు మేరకు అశ్లీల వెబ్ సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్‌సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని 'మా' అసోసియేషన్ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి తమకు ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.