
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా సాధన కోసం చేస్తున్న ఉద్యమానికి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’(మా) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యవర్గ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ బాగుంటేనే తెలుగు చిత్రపరిశ్రమ బాగుంటుంది. ఏపీకి ప్రత్యేకహోదా సాధన మహోద్యమంలో ‘మా’ కూడా భాగస్వామ్యం అవుతుంది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు. దాన్ని సాధించే వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం, ఉద్యమకారులకు పార్టీలకు అతీతంగా వెన్నుదన్నుగా ఉంటూ అండదండలు అందిస్తాం’’ అని ‘మా’ పేర్కొంది.