
సీనియర్ హీరో నరేశ్ జన్మదిన వేడుకలు శనివారం సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో అభిమానుల సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ – నరేశ్ కెరీర్ ఇప్పుడు మంచి బూస్ట్‌లో ఉంది. ‘శతమానం భవతి’ సినిమా దర్శకుణ్ణి సన్మానించడం సంతోషంగా ఉంది. నిర్మాత ‘దిల్’ రాజు ఒకే ఏడాది ఆరు హిట్స్ సాధించడం విశేషం. నరేశ్ ఇలానే మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
‘‘అటు సినిమాలతో అలరిస్తూ ఇటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నరేశ్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విజయ నిర్మల. ‘‘అప్పుడే 50 ఏళ్లు అంటే నమ్మబుద్ధి కావటం లేదు. నా దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు. వినోదం పంచటం, సేవ చేయటమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. విజయ కృష్ణ పేరుతో త్వరలో ట్రస్ట్ ఏర్పాటు చే స్తాను’’ అన్నారు నరేశ్. నటుడు మురళీమోహన్ ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, వేగేశ్న సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment