‘అప్పుడు ఇప్పుడు’విడుదల ఎప్పుడంటే... | Appudu Ippudu Movie To Release On September 3rd | Sakshi
Sakshi News home page

‘అప్పుడు ఇప్పుడు’విడుదల ఎప్పుడంటే...

Published Sat, Aug 28 2021 3:00 PM | Last Updated on Sat, Aug 28 2021 3:03 PM

Appudu Ippudu Movie To Release On September 3rd - Sakshi

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా, చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడు-ఇప్పుడు’.ఈ చిత్రాన్ని యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. (ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రంలో  శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
(చదవండి: ‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్‌ బాబు రివ్యూ)

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విశ్వనాధ్ విడుదల చేసిన పాటతో పాటు పూరి జగన్నాద్‌ విడుదల చేసిన టీజర్‌కు అదరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.  దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు . అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని వచ్చే నెల 3న విడుదల చేస్తున్నాం’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement