sujan
-
రూ.24 కోట్ల ఆస్తిపై రూ.91 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: ‘‘సుజనా ఇండస్ట్రీస్, వోల్టాస్, వర్మ రియల్టర్స్ కంపెనీలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తిని తాకట్టుపెట్టారు. అదికూడా రూ.24 కోట్ల విలువైన ఆస్తిని తనఖా చూపి బ్యాంకు నుంచి రూ.91 కోట్లు రుణాన్ని పొందారు. ప్రజా ఆస్తులను దురి్వనియోగం చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీపై విచారణ జరిపించాలి..’’ అని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త హబీబ్ అల్లాద్దీన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు విచారణ ప్రారంభించలేదని కోర్టుకు వివరించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 193 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 90 రోజుల్లో చార్జిషిట్ దాఖలు చేయాలని.. కానీ 11 నెలలు అవుతున్నా దర్యాప్తు ప్రారంభించలేదని, దీని వెనుక సుజానా చౌదరి ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రతివాదుల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా, సమన్లు జారీ చేసిన విచారణ జరపాల్సిందిగా సీసీఎస్ పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున ఎస్.ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీస్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ జీపీ (ప్రభుత్వ న్యాయవాది)ని ఆదేశిస్తూ, విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేశారు.చట్టవిరుద్ధంగా తనఖా పెట్టారు.. ‘‘హైదరాబాద్ అమీర్‌పేట్ మండలం బహ్లూఖాన్గూడ సర్వే నంబర్ 129/3లోని 26,436.36 చదరపు గజాలు మాకు (హబీబ్ అల్లాద్దీన్కు) చెందిన భూమిని వర్మ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పీవీ రమణారెడ్డి 2013లో ఎక్స్‌పోర్టు–ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టారు. నిజానికి ఆ భూమిని మేం 1963లో వోల్టాస్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చాం. లీజుకు ఇచి్చన వారిలో నేను భాగస్వామిని. ఈ భూమిని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలనేది ఒప్పందం. లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిన వోల్టాస్ 26,436 చదరపు గజాల భూమిని వర్మ రియల్టర్స్‌కు కేటాయించింది.సుజనాచౌదరి చైర్మన్‌గా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి వర్మ రియల్టర్స్ ఈ భూమిని తనఖాగా చూపి గ్యారంటీర్‌గా వ్యవహరించింది. లీజు భూమిని తనఖా పెట్టకూడదని తెలిసినా బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. సుజనా చౌదరి గతంలో టీడీపీ ఎంపీగా, ప్రస్తుతం బీజేపీ తరఫున విజయవాడ పశి్చమ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుజనా ఇండస్ట్రీస్ రుణాల చెల్లింపులో విఫలం కావడంతో.. బకాయిలు రాబట్టడం కోసం రూ.400 కోట్ల విలువైన నా ఆస్తి మొత్తాన్ని అటాచ్ చేసి.. వేలానికి పెట్టేలా ఉన్నారు’’ అని కోర్టుకు పిటిషనర్ వివరించారు. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. ‘‘ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడంతో.. లీజ్ డీడ్ రద్దు కోరుతూ 2013లో మేం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాం. మా భూమిని ఇతరుల పేరుపైకి మార్చకుండా, తనఖా పెట్టకుండా ఆదేశాలివ్వాలని కోరగా.. మాకు అనుకూలంగా తీర్పు వచి్చంది. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వర్మ రియల్టర్ సంస్థ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆ పిటిషన్లను కొట్టివేశాయి. నిజానికి ఆ రుణం మంజూరు చేసే నాటికే సుజనా చౌదరి రుణ ఎగవేతదారుగా ఉన్నారు. అయినా బ్యాంకు నుంచి సుజనా ఇండస్ట్రీస్‌కు రుణం మంజూరైంది. వర్మ రియల్టర్స్‌కు చెందిన 96.64 శాతం షేర్లను సుజనా హోల్డింగ్స్ నిర్వహించడం ఆశ్చర్యకరం. ఈ రెండు సంస్థల్లోనూ గొట్టుముక్కల శ్రీనివాసరాజు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇది గమనిస్తే సుజనా హోల్డింగ్స్‌కు వర్మ రియల్టర్స్ బినామీ లాంటి (ప్రాక్సీ) కంపెనీ అని తెలుస్తోంది’’ అని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.సుజనా ఒత్తిడితోనే ప్రారంభంకాని విచారణ..‘‘మా ఆస్తిని తనఖా పెట్టి సుజనా ఇండస్ట్రీస్ రుణం పొందేలా చేయడంలో వర్మ రియల్టర్స్‌కు అనుకూలంగా వోల్టాస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ఎల్. కర్కరే వ్యవహరించారు. వర్మ రియల్టర్స్‌కు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ మొత్తం లావాదేవీ మోసపూరితంగా, నేరపూరితంగా జరిగింది. అసలు వర్మ రియల్టర్స్ ఆస్తిని లీజుకు మాత్రమే తీసుకుంది. దాని విలువ రూ.24 కోట్లే అయినా.. రూ.91 కోట్లను ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఇచ్చిందో అర్థంకావడం లేదు. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి బ్యాంకు అధికారులను ఏమార్చి ఉండవచ్చు. రుణ లావాదేవీ అనుమానాస్పదంగా, అస్పష్టంగా, అపారదర్శకంగా ఉంది. దీనిపై ఫిర్యాదు చేసినా సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఏదో లెక్కకోసం మాత్రమే ఎఫ్ఐఆర్ చేసినట్లున్నారు. ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. సుజనా చౌదరి ఒత్తిడి కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదు.సుజనా ఆస్తులను, వర్మ రియల్టర్స్ ఆస్తులను అటాచ్ చేయకుండా బ్యాంకు నా ఆస్తిని అటాచ్ చేయడం చట్టప్రకారం చెల్లదు. సుజనా చౌదరిపై, సుజనా ఇండస్ట్రీస్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసినా.. ఇప్పటివరకు వారిని టచ్ కూడా చేయలేదు. అక్రమార్కులతో కుమ్మక్కైన రిజిస్ట్రేషన్ అధికారులు కూడా.. నేను ఆ భూమి ఈసీ సరి్టఫికెట్కోసం దరఖాస్తు చేస్తే మార్టిగేజ్ వివరాలు లేకుండా ఇచ్చారు. ప్రతివాదుల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ను ఆదేశించండి. ప్రతివాదులకు సమన్లు జారీ చేసి, విచారణ జరపాలి. చట్టవిరుద్ధంగా ప్రజా నిధుల నుంచి రూ.91 కోట్లు పొంది దురి్వనియోగం చేశారు. మా పిటిషన్‌ను అనుమతించండి’’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ న్యాయవాదిని ఆదేశించారు.పిటిషన్లో పేర్కొన్న ప్రతివాదులు వీరే.. పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ సీపీ, బషీర్‌బాగ్ సీసీఎస్ ఇన్స్పెక్టర్తోపాటు ప్రతివాదులుగా సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనాచౌదరి, ‘సుజన’ డైరెక్టర్లు గొట్టుముక్కల శ్రీనివాస్‌రాజు, నటరాజన్ సుబ్బరత్నం, కిరణ్ కుమార్ వీరమాచినేని, ఓల్టాస్ లిమిటెడ్ ఎండీ, డైరెక్టర్లు బహ్రం నవ్రోజ్ వాకిల్, జుబిన్ సోలి దుబాష్, వినాయక్ కాశీనాథ్ దేశ్‌పాండే, ప్రదీప్‌కుమార్, దేబేంద్రనాథ్ సారంగి, వర్మ రియల్టర్స్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘వర్మ’ డైరెక్టర్లు రమణారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి దేవిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి కంచర్ల, శ్రీరామ్ కంబంపాటి, ఎక్స్‌పోర్టు–ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
‘అప్పుడు ఇప్పుడు’విడుదల ఎప్పుడంటే...
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా, చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడు-ఇప్పుడు’.ఈ చిత్రాన్ని యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. (ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రంలో శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (చదవండి: ‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్ బాబు రివ్యూ) ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విశ్వనాధ్ విడుదల చేసిన పాటతో పాటు పూరి జగన్నాద్ విడుదల చేసిన టీజర్‌కు అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు . అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని వచ్చే నెల 3న విడుదల చేస్తున్నాం’ అన్నారు. -
పాటల సందడి
సుజన్, తనిష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఓ పాటని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకి హైలెట్’’ అన్నారు. ‘‘కె.విశ్వనాథ్‌గారి విడుదల చేసిన మొదటి పాటకు, కె.రాఘవేంద్రరావుగారు విడుదల చేసిన మరో పాటకి మంచి స్పందన వచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌గారు విడుదల చేసిన టీజర్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో మా సినిమా మీద బజ్ పెరిగింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు. -
దుర్గాపురం వారి నాటక ప్రదర్శన
‘మీరు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న శ్రీ దుర్గాపురం వారి నాటక ప్రదర్శన మరికాసేపట్లోనే మొదలవబోతోంది’ అంటూ విడుదలైన ‘అప్పుడు–ఇప్పుడు’ టీజర్ ఆసక్తిగా ఉంది. సుజన్, తనిష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటించారు. యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసి, ‘టీజర్ చాలా బాగుంది. సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. ‘‘పూరి జగన్నాథ్‌గారు మా టీజర్‌ను విడుదల చేయడం సంతోషం. పాటలకు మంచి స్పందన వస్తోంది. టీజర్‌తో ఇటు సినీ అభిమానుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి, సంగీతం: పద్మానావ్ భరద్వాజ్. -
మంచి కామెడీ
సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. యు.కె. ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించారు. ఈ చిత్రంలోని రెండవ పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘పాట చాలా బాగుంది. తప్పకుండా ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది’’ అన్నారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా బాగా నటించారు. దసరాకి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి, దర్శకులు విశ్వనాథ్‌గారు రిలీజ్ చేసిన మొదటి గీతానికి మంచి స్పందన వచ్చింది. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ‘‘చలపతి కొత్తవాడైనా అనుభవం ఉన్నవాడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు. -
మంచి వినోదం
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా చలపతి పువ్వుల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కునుమూరి, విజయ రామకృష్ణ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయనున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. శివాజీ రాజా, మాధవి, శ్రీనివాస్ పేరుపురెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: కల్యాణ్ సమి, సంగీతం: పద్మానావ్ భరద్వాజ్. -
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఇద్దరు యువకుల గల్లంతు
ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలుస్తోంది. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పొలుమూరి సుజన్(22), ఓ ప్రైవేటు స్కూల్లో ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేస్తోన్న మాచర్ల సునీల్(22)లు గల్లంతైన వారిగా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. -
ఇదేగా ఆశ పడ్డావ్ మూవీ స్టిల్స్
-
ఇదేగా ఆశ పడ్డావ్ మూవీ ఆడియో లాంచ్