
చైతన్య, పూరి జగన్నాథ్, చలపతి పువ్వుల
‘మీరు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న శ్రీ దుర్గాపురం వారి నాటక ప్రదర్శన మరికాసేపట్లోనే మొదలవబోతోంది’ అంటూ విడుదలైన ‘అప్పుడు–ఇప్పుడు’ టీజర్ ఆసక్తిగా ఉంది. సుజన్, తనిష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటించారు. యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసి, ‘టీజర్ చాలా బాగుంది. సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నారు.
చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. ‘‘పూరి జగన్నాథ్‌గారు మా టీజర్‌ను విడుదల చేయడం సంతోషం. పాటలకు మంచి స్పందన వస్తోంది. టీజర్‌తో ఇటు సినీ అభిమానుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి, సంగీతం: పద్మానావ్ భరద్వాజ్.
Comments
Please login to add a commentAdd a comment