సినిమాలంటే అంత పిచ్చి | Nivuru Movie Logo Launch | Sakshi
Sakshi News home page

సినిమాలంటే అంత పిచ్చి

May 25 2018 5:00 AM | Updated on May 25 2018 5:00 AM

Nivuru Movie Logo Launch - Sakshi

మహాదేవ్‌,శివాజీరాజా

మహాదేవ్‌ హీరోగా, మమతా సాహాస్, సునైన హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నివురు’. ఋషికృష్ణ దర్శకత్వంలో అభిరామ్‌ నిర్మించిన ఈ సినిమా టైటిల్‌ లోగోని ‘మా’ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –‘‘హీరో మహాదేవ్‌ చిన్నప్పటి నుంచి అందరి హీరోల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతనికి సినిమాలంటే అంత పిచ్చి. సంగీతం, ఛాయాగ్రహణం అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం హిట్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చదువు పెద్దగా అబ్బకపోయినా, సినిమా మీద ప్యాషన్‌తో ఎన్నో కష్టాలకోర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు మహాదేవ్‌. ‘‘మా ఇల్లు అమ్ముకుని, ఆటో తోలుకుంటూ ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రం హిట్‌ అయ్యి, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి’’ అన్నారు అభిరామ్‌. రైటర్‌ డైమండ్‌ రత్నబాబు, నటుడు కాశీ విశ్వనాధ్, సంగీత దర్శకుడు యం.ఎల్‌. రాజా పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement