న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రశేఖర్‌ను త్వరలో భారత్‌కు రప్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, మోసం కేసులో ఈడీ వినతి మేరకు ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఇటీవల దుబాయ్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడీ వర్గాల వినతి మేరకు చంద్రశేఖర్‌తోపాటు ఈ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌ను కూడా దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు.
మరికొద్ది రోజుల్లో చంద్రశేఖర్ భారత్‌కు వస్తాడని ఆ వర్గాలు వివరించాయి. చంద్రశేఖర్ 2019లో దుబాయ్ పారిపోయేందుకు ముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భిలాయ్‌లో సోదరుడితో కలిసి జ్యూస్ షాపు నిర్వహించేవాడు. మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment