betting case
-
త్వరలోనే భారత్‌కు ‘మహదేవ్ యాప్’ సూత్రధారి
న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రశేఖర్‌ను త్వరలో భారత్‌కు రప్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, మోసం కేసులో ఈడీ వినతి మేరకు ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఇటీవల దుబాయ్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడీ వర్గాల వినతి మేరకు చంద్రశేఖర్‌తోపాటు ఈ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌ను కూడా దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొద్ది రోజుల్లో చంద్రశేఖర్ భారత్‌కు వస్తాడని ఆ వర్గాలు వివరించాయి. చంద్రశేఖర్ 2019లో దుబాయ్ పారిపోయేందుకు ముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భిలాయ్‌లో సోదరుడితో కలిసి జ్యూస్ షాపు నిర్వహించేవాడు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేసింది. -
బెట్టింగ్ కేసులో ఇంగ్లండ్ బౌలర్‌పై నిషేధం
ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ నిషేధాన్ని ఎదుర్కోనున్నాడు. 2017-2019 మధ్యలో బెట్టింగ్‌కు పాల్పడినట్లు రుజువు కావడంతో కార్స్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 16 నెలల నిషేధాన్ని విధించింది. దక్షిణాఫ్రికాలో జన్మించి, ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 28 ఏళ్ల కార్స్ తాను పాల్గొన్న మ్యాచ్‌ల్లో కాకుండా మిగతా మ్యాచ్‌లపై బెట్టింగ్ కాసాడని క్రికెట్ రెగ్యులేటర్ ఏసీబీ విచారణలో తేలింది. బెట్టింగ్ కాసిన విషయాన్ని కార్స్ కూడా అంగీకరించాడు. 16 నెలల్లో 13 నెలల నిషేధం రెండేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉంటుందని ఈసీబీ తెలిపింది. ప్రస్తుతానికి కార్స్‌పై మూడు నెలల నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్ 28 వరకు కార్స్ క్రికెట్లోని ఏ ఫార్మాట్లో అయినా పాల్గొనేందుకు అనర్హుడు.రాబోయే రెండేళ్లలో అతను అవినీతి నిరోధక నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నేరాలకు పాల్పడకపోతే మిగిలిన 13 నెలల నిషేధం అమల్లోకి రాదు. కార్స్‌పై 303 బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. 2016లో డర్హమ్ కౌంటీలో అరంగేట్రం చేసిన కార్స్.. 2021 నుంచి ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కార్స్ ఇంగ్లండ్ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడి మొత్తంగా 19 వికెట్లు పడగొట్టాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కార్స్ ఇటీవలికాలంలో ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. కార్స్ బ్యాటింగ్‌లోనూ అడపాదడపా మెరుపులు మెరిపించగల సమర్ధుడు.ఇదిలా ఉంటే, నేటి నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జూన్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్.. ఆసీస్‌తో కలిసి గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఇతర జట్లుగా ఉన్నాయి. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు? బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్, ఇన్ఫ్లూయెన్సర్గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్‌కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్‌లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) -
ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ వివాదం... చిక్కుల్లో తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దదత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఆయన ఈ ఏప్రిల్ 23న విచారణకు రావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని.. వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేది కేటాయించాలని పోలీసులను కోరారు. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా తమన్నాకు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఫెయిర్ ప్లే యాప్‌పై గతంలోనూ మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ యాప్ మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఈడీ గుర్తించి సదరు సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి అధికారికంగా ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటకిఈ గతేడాది నిబంధనలకు విరుద్దంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేశారు. వాటిని చూడలంటూ తమన్నా.. సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ లాంటి అగ్రతారలు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. -
ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ వివాదం... చిక్కుల్లో తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దదత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఆయన ఈ ఏప్రిల్ 23న విచారణకు రావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని.. వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేది కేటాయించాలని పోలీసులను కోరారు. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా తమన్నాకు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఫెయిర్ ప్లే యాప్‌పై గతంలోనూ మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ యాప్ మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఈడీ గుర్తించి సదరు సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి అధికారికంగా ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటకిఈ గతేడాది నిబంధనలకు విరుద్దంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేశారు. వాటిని చూడలంటూ తమన్నా.. సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ లాంటి అగ్రతారలు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. -
Mahadev app case: సీఎం బఘేల్‌కు డబ్బు పంపలేదు
రాయ్‌పూర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్‌చేసిన నగదు కొరియర్ ఆసిమ్ దాస్ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్ తన లాయర్ షోయబ్ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్‌లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్రూమ్కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్‌చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్ వివరించారు. -
22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్’తో సహా 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌ల సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ‘మహదేవ్ బుక్’యాప్‌తో పాటు ఇతర బెట్టింగ్‌యాప్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది. అయితే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్‌ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్‌ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. -
వరల్డ్‌కప్ క్రికెట్ ప్రతీ సిక్స్, ఫోర్‌పైనా.. బెట్టింగ్ నీదా.. నాదా..!?
ఖమ్మం: క్రికెట్ ప్రపంచకప్ మొదలైంది. దీంతోపాటు బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. వరుసగా భారత్ మ్యాచ్‌లు ఉండటంతో బెట్టింగ్ రాయుళ్లు ఈసారైనా గతంలో పోగొట్టుకున్నది వస్తుందేమోననే ఆశతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్ టోర్నమెంట్లు వరుసగా జరగడంతో స్వల్ప సమయంలో ఎక్కువ ధనార్జన కోసం ఈ పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచకప్ సుమారు నెలన్నరపాటు జరగనుండటంతో బెట్టింగ్ జోరుగా సాగే అవకాశాలున్నాయి. ఒకప్పుడు కేవలం మెట్రో ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్ ప్రస్తుతం పల్లెలకు సైతం విస్తరించింది. జిల్లాలోని ఖమ్మంలో బార్లు, హోటళ్లు మ్యాచ్‌లు ఉన్న సమయంలో నిండిపోతున్నాయి. బెట్టింగ్‌లు ఉండటంతోనే ఇవి కళకళలాడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెట్టింగ్‌ను నియంత్రించే వాళ్లు లేకపోవడంతో పందెం కాసేవాళ్లకు హద్దు లేకుండా పోయింది. అయితే, బెట్టింగ్‌లో పాల్గొని అప్పులపాలై కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జిల్లాలో ఉన్నాయి. ప్రతీ సిక్స్, ఫోర్‌పైనా.. ఒకప్పుడు ఆన్లైన్ ద్వారా బెట్టింగ్‌లు జరిగేవి. మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా జోరుగా పందేలు సాగుతున్నాయి. భారత్ ఆడే 9 మ్యాచ్‌ల్లో ఎవరు గెలుస్తారనే దానిపైనే పందేలు ఎక్కువగా కాస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు కూడా బెట్టింగ్ నడుస్తూనే ఉంటుందని తెలుస్తోంది. బ్యాట్స్‌మెన్ కొట్టే సిక్స్, ఫోర్లపైనా.. బౌలర్ తీసే వికెట్లపైనా.. వైడ్ బాల్, నోబాళ్లపైనా పందేలు నడుస్తుంటాయి. మ్యాచ్ టై అయ్యే దానిపైన కూడా పందెం వేసుకునే వెసులుబాటు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు పోగొట్టుకుంటున్న యువత.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత జోరుగా బెట్టింగ్‌కు పాల్పడుతోంది. ఇంట్లో తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి డబ్బు తీసుకోవడం.. స్నేహితుల దగ్గర అప్పుగా తీసుకొని పందెంలో పెట్టి పోగొట్టుకోవడం తరచుగా కనిపిస్తోంది. ఆన్లైన్లో జరిగే బెట్టింగ్‌లో వంద పెడితే రూ.300 ఇస్తామంటూ ఊరిస్తూ వలలో వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు. తొలుత డబ్బులు వచ్చినట్టే వచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. అప్పుడు పోయిన డబ్బు కోసం మళ్లీ పందెం కాయడం, ఉన్న డబ్బు అంతా పోగొట్టుకోవడం.. దీంతో మనస్తాపానికి గురై యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు చెబుతున్నారు. కాగా, ఖమ్మంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో లింక్‌బార్లే బెట్టింగ్‌కు అడ్డాలుగా మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. లింక్ బార్లో కూర్చోని, మద్యం సేవిస్తూ సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం, బెట్టింగ్ ఖర్చులను లింక్‌బార్ యాజమాని వద్దే అప్పుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆఫ్లైన్లోనూ.. గతంలో క్రికెట్ బెట్టింగ్ కేవలం ఆన్లైన్ ద్వారానే కొనసాగేది. ఇందుకోసం ముందస్తుగా రూ.లక్ష డిపాజిట్ చేస్తే ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పేలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బెట్టింగ్‌కు పాల్పడటం సులభంగా మారింది. ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడితే దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కారణాలతో ఫోన్ పే, గూగుల్ పేనే ఆశ్రయిస్తున్నారు. అయితే, దాదాపు నెలన్నర రోజుల పాటు బెట్టింగ్ జరిగే అవకాశాలున్నప్పటికీ దీనిని నియంత్రించే వారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖ పట్టిష్టమైన గస్తీని ఏర్పాటు చేసి బెట్టింగ్‌కు పాల్పడే ముఠాలను పట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్ హీరోయిన్‌కు సమన్లు!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో రణ్‌బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా ఖురేషికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో నటి శ్రద్ధా కపూర్‌కు సైతం నోటీసులిచ్చారు. ఇవాళ ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించగా.. రణ్‌బీర్ కపూర్ హాజరయ్యేందుకు రెండు వారాల గడువు కోరారు. అయితే ఈరోజు శ్రద్ధా కపూర్ ఈడీ ముందుకు హజరవుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!) ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లకు కూడా వేర్వేరు తేదీల్లో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఈడీ ముందు హాజరు కావడానికి రెండు వారాల సమయం కోరినట్లు తెలిపారు. అయితే ఈ కేసులో వీరందరినీ నిందితులుగా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం యాప్ ప్రమోటర్లు వారికి చేసే చెల్లింపు విధానం మాత్రమే ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ మహదేవ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
TS Crime News: ఆన్లైన్ ఆటలు ఆడుతున్నారా..! జర జాగ్రత్త..!
కుమరం భీం: నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ బెట్టింగ్ ఆదివాసీ జిల్లా కుమురంభీంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. కఠిన చట్టాలు, పోలీసుల నిఘా ఉన్నా బెట్టింగ్ దందాలకు అడ్డుకట్ట పడటం లేదు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది యువత బానిసలుగా మారుతున్నారు. చివరికి అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, వాంకిడి వంటి ప్రాంతాల్లోని యువత తరచూ నిషేధిత ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్‌లోని ఓ చిట్‌ఫండ్‌లో కలెక్షన్ బాయ్‌గా విధులు నిర్వర్తించే ప్రమోద్‌సింగ్ అనే యువకుడు మూడేళ్లుగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దాదాపుగా రూ.2.60 లక్షల వరకు ఆన్లైన్ గేమ్స్‌లో పోగొట్టుకున్నాడు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఈ ఆదివారం రాత్రి ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. కంపెనీ మేనేజర్లను డబ్బు విషయంలో పక్కదారి పట్టించేందుకు ఈ నెల 21న కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం సమీపంలో తనకు తానే మందు బాటిల్స్‌తో తీవ్రంగా గాయపర్చుకున్నాడు. తనపై ముగ్గురు దాడి చేసి, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. విచారణలో బెట్టింగ్ విషయం బయట పడింది. కౌటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఏడాది నుంచి ఆన్లైన్లో కాక్‌ఫైట్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. చైన్ సిస్టం లాంటి ఈ గేమ్‌లో ఒకరి నుంచి మరొకరు గేమ్ ఆడటం మొదలెట్టారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లపాటు కష్టపడి సంపాదించిన నగదు ఈ గేమ్‌లో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు యువకులు ఏకంగా రూ.1.60 కోటికి పైగానే కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలు జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి ఎలా విస్తరిస్తుందో తెలియజేస్తున్నాయి. నిఘా ఉన్నా.. ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజల చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌తోపాటు మూడు ముక్కలాట పేరుతో ముగ్గులోకి దింపి అందినకాడికి దండుకునే ముఠాలపై గట్టి నిఘా పెడుతున్నారు. వరుస బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అయినా ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. యువకులు, చిరు వ్యాపారులు సైతం బెట్టింగ్ మోజులో పడి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ దందాలు.. ఇప్పుడు జిల్లాలోని అన్ని పల్లెలకూ పాకడం కలవరపెడుతోంది. నేరుగా పరిచయం లేకుండానే సెల్ఫోన్లోనే బెట్టింగ్ యాప్‌లు ఇన్స్టాల్ చేసుకుని యూపీఐ ఐడీలతో నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. రాష్ట్రంలో నిషేధించిన యాప్‌లను వీపీఎన్ సాయంతో లొకేషన్ మారుస్తూ వినియోగిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. కొంత మంది మైనర్లు వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీ ఐ ఐడీల ద్వారా పందెం కాస్తున్నారు. యువత ఈజీ మనీ కోసం కెరీర్‌ను సైతం ఇబ్బందుల్లోకి నెట్టి పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులు దృష్టి సారిస్తేనే.. జిల్లాలో ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ మట్కా ఎక్కువగా సాగుతుంది. ఐపీఎల్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనే రూ.లక్షల్లో చే తులు మారుతుంది. ఈ నెలలో ప్రారంభమ య్యే ఆసియా క్రికెట్ కప్‌తోపాటు అక్టోబర్‌లో స్వదేశంలో మొదలయ్యే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, యువత ను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగిన సమయంలో ఆరా తీయాలి. వారికి కౌన్సెలింగ్ ఇప్పించి అవగాహన కార్యక్రమాలకు పంపించాలి. బెట్టింగ్ నిషేధం.. ఆన్లైన్ బెట్టింగ్ నిషేదం. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ జూదంపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు చేపడుతాం. ఈ విషయమై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. – కరుణాకర్, డీఎస్పీ, కాగజ్‌నగర్ తల్లిదండ్రులు నిఘా ఉంచాలి.. యుక్త వయసు పిల్లలు ముఖ్యంగా 15 నుంచి 25 ఏళ్ల వారిపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఎక్కడికెళ్తున్నారు.. ఎం చేస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోవాలి. బెట్టింగ్‌ల వైపు మరలకుండా ఇతర వ్యాపకాలు ఉండేలా చూడాలి. ఇతరుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో వారికి వివరించాలి. – రామకృష్ణ, డీఎంహెచ్‌వో అత్యాశతో నష్టం తక్కువ సమయంలోనే రూ.లక్షలు సంపాదించాలనే అనే దురాశ యువతను పక్కాదారి పట్టిస్తోంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, కాక్‌ఫైట్, తీన్మార్ పేకాట, ఇతర జూదాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆటల్లో రూ.లక్షలు కోల్పోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న వారు తల్లిదండ్రులకు చెప్పలేక.. అప్పులు తీర్చలేక ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతున్నాయి. మరో దారి లేకపోవడంతో కొంత మంది ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఈ ఆన్లైన్ ఆటలకు బానిసవుతున్న వారిలో 18 నుంచి 28 ఏళ్ల వారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. -
కోడి పందాల కేసు.. చింతమనేనికి అదిరిపోయే షాక్
-
గేమింగ్ కేసుపై గూగుల్ లెన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆయా కేసుల దర్యాప్తునకు నిందితుల ఫోన్లే ఆధారంగా మారుతున్నాయి. ఇటీవల దాదాపు ప్రతి కేసులోనూ కీలకాధారాలు నిందితుల ఫోన్ల నుంచే లభిస్తున్నాయి. వైట్ కాలర్ అఫెన్సులుగా పిలిచే మోసాలకు సంబంధించిన కేసుల్లో వీటి విశ్లేషణ అనివార్యం, అత్యంత కీలకం. ఈ–కామర్స్ ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ కేసులోనూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల ఫోన్లను విశ్లేషణ చేస్తున్నారు. కీలక నిందితుడైన చైనీయుడు యాన్ హూ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో చాటింగ్స్ మొత్తం చైనా భాషలో ఉన్నాయి. దీంతో గూగుల్ లెన్స్ యాప్ సాయంతో అందులోని వివరాలను సంగ్రహిస్తున్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పేటీఎం ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరాలు సేకరించారు. డాకీపే పేరిట వాట్సాప్ గ్రూప్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం అతడితోపాటు ముగ్గురు ఢిల్లీవాసుల్నీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడి వాట్సాప్‌ను పరిశీలించగా డాకీపే అంటూ ఇంగ్లిష్‌లో రాసి ఉన్న ఓ గ్రూప్ కనిపించింది. గ్రూప్ పరిశీలించగా అందులో యాన్ హూ ఇచ్చిన సందేశాలతోపాటు ఇతరులు చేసిన చాటింగ్స్ కూడా చైనా భాషలోనే ఉన్నాయి. దీంతో ఆ చాటింగ్స్లోని అంశాలను తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్ లెన్స్ యాప్‌ను వాడుతున్నారు. అందులో చైనా భాషలో ఉన్న వివరాలను ఇంగ్లిష్‌లో చూపిస్తోంది. ఇందులో లభించిన అంశాలను బట్టే ఢిల్లీకి చెందిన ఎనిమిది సంస్థలకు ఐసీఐసీఐ బ్యాంకులోనూ మరో ఖాతా ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఫ్రీజ్ చేయించడానికి చర్యలు తీసుకుంటున్నారు. చార్జ్‌షీట్‌కు చాటింగ్స్ వివరాలు కీలకం సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికీ ఈ చాటింగ్స్లోని వివరాలు కీలకం. గూగుల్ లెన్స్‌ను వాడుతున్నాం. అధికారిక ట్రాన్స్‌లేటర్ ద్వారా తర్జు మా చేయించి, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక జత చేసి దాఖలు చేయాల్సి ఉంటుంది’అని అన్నారు. బెట్టింగ్స్‌తో రూ.1,107 కోట్లు నిందితులు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1,107 కోట్లు బెట్టింగ్స్ ద్వారా ఆర్జించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వీటిలో రూ.110 కోట్లు ఇప్పటికే చైనాకు వివిధ మార్గాల్లో తరలిపోయాయి. వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.30 కోట్లను ఇప్పటికే అధికారులు ఫ్రీజ్ చేశారు. మిగిలిన రూ.967 కోట్ల లావాదేవీలపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇవి హవాలా మార్గంలో వెళ్ళాయా? లేక ఇంకా గుర్తించాల్సిన బ్యాంకు ఖాతాలు ఉన్నాయా? అనేది ఆరా తీస్తున్నారు. కలర్ ప్రిడెక్షన్‌ను పేమెంట్ గేట్ వేగా పని చేసిన పేటీఎంకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ ఠాణాలో హాజరైన ఈ ప్రతినిధులు తమ యాప్ ద్వారా కలర్ ప్రిడెక్షన్కు సంబంధించి రూ.649 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటిని ఆ సంస్థకు చెందని రెండు ఖాతాల్లోకి మళ్ళించామని వెల్లడించారు. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా వచ్చిన సొమ్మునూ తాము క్రోడీకరించి హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాల్లోకి పంపినట్లు అంగీకరించారు. మరిన్ని వివరాల కోసం ఈ సంస్థ ప్రధాన కార్యాలయానికి సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాయనున్నారు. -
బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని రాజాం పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సంబంధించి మరో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. వారం రోజుల క్రితం ఐదుగురి బెంటింగ్రాయుళ్లను రాజాం పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో మరో ఐదుగురు పరారయ్యారు. వారిని గురువారం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వాటి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు ఎస్పీ వెల్లడించారు. గతంలోనే ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం పట్టుకున్న ముఠా నుంచి రూ. 2.40 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజాం పోలీసులు పట్టుకున్న ముఠాలో రాజాం పట్టణానికి చెందిన గొర్లె దుర్గారావు, రాజాం మండలం దోసరి గ్రామానికి చెందిన కత్రి సింహాచలం, వంగర మండలం కొండచాకరాపల్లికి చెందిన గెంబలి అనిల్‌కుమార్, రేగిడి ఆమదాలవలస మండలం పెద్దశిర్లాం గ్రామానికి చెందిన లెంకా చిన అప్పలనాయుడు, రాజాం మండలం మొగిలివలసకు చెందిన ఆబోతుల భగవాన్ ఉన్నారన్నారు. క్రికెట్ బెట్టింగ్ యాప్‌ను ఉపయోగించుకొని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. యాప్ ద్వారా రేటింగ్స్ ముందుగానే లెక్కించి ఏ టీంకు బెట్టింగ్ కాయడం వల్ల లాభదాయకంగా ఉంటుందో తెలియజేస్తారని, దానికి అనుగుణంగా యువతను బెట్టింగ్‌లోకి దించుతున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్ సమాజానికి మంచిదికాదని ఎస్పీ అన్నారు. యువత బెట్టింగ్‌లోకి దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయన్నారు. బెట్టింగ్ వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు ‘ఆపరేషన్ లక్ష్య’.. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సుదీర్ఘ జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాల నివారణకు మొబైల్ పోలీసు బృందాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ‘ఆపరేషన్ లక్ష్య’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి వాహనాలకు ముందు, వెనుక రేడియం స్టిక్కర్లను అతికించే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. వన్ స్టిక్కర్–వన్ లైఫ్ నినాదంతో వీటిని తయారుచేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతను మంచి మార్గంలో నడిపే దిశగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. భామిని మండలంలో ఇటీవల వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. త్వరలో సీతంపేటలో వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసులకు సమాజ పరిస్థితులపై అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. జిల్లాలో పోలీసుశాఖ తరఫున లక్ష మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఎచ్చెర్ల ఏటీఎం చోరీపై మాట్లాడుతూ ఒక బృందం రాజస్థాన్ వెళ్లిందని, ఈ నెలాఖరు నాటికి ఈ కేసు విషయంలో ప్రగతి ఉండవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జి.గంగరాజు, రాజాం సీఐ సి.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కోట్లు పోగొట్టుకున్న సల్మాన్ సోదరుడు!
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బెట్టింగ్ స్కాంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌కు సమన్లు అందిన విషయం తెలిసిందే. బుకీల ద్వారా బెట్టింగ్‌కు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. విచారణకు హాజరు కావాలని అర్భాజ్‌కు థాణే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పట్టుబడ్డ బుకీ సోనూ జలాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే టైమ్స్‌నౌ చానెల్ తెలిపిన వివరాల ప్రకారం అర్బాజ్‌ఖాన్ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు పోగట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ స్కాంలో బాలీవుడ్ పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు మూడు కోట్ల రూపాయలను అర్బాజ్‌ఖాన్ పోగొట్టుకున్నాడని, ఈ డబ్బులు సోనూ జలన్కు ఇవ్వక పోవడంతో అతను బ్లాక్ మెయిల్‌కు దిగినట్లు, అయినా అర్బాజ్‌ఖాన్ స్పందించకపోవడంతో అతని పేరు బయట పెట్టినట్లు తెలుస్తోంది. అర్బాజ్‌ఖాన్ తనకు తెలసిన వ్యక్తులతో ఈ ఐపీఎల్లో రెండు మ్యాచ్‌లను ఫిక్స్ చేసినట్లు జలాన్ పోలీసు విచారణలో వెల్లడించాడని టైమ్స్ నౌ పేర్కొంది. జలాన్‌కు అండర్ వరల్డ్ డాన్ దావుద్‌తో సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే 16న ముంబైలోని డొంబీవిలీలో నలుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేయగా.. కల్యాణ్ సెషన్స్‌కోర్టు పరిసరాల్లో సోను జాలాన్ను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ కేంద్రంగా బెట్టింగ్‌లకు పాల్పడిన దావుద్ ముఠాలోని అనిల్ తుండా, రయిస్ ఫరుఖీలతో జాలాన్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవాడు. బెట్టింగ్ వివరాలన్ని జలాన్ డైరీలో పుసగుచ్చినట్టు రాసుకున్నాడు. ఈ డైరీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లతో ఏం చేయలేరు.. బెట్టింగ్‌లు క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం చూపవని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ మాజీ అధికారి నీరజ్ కుమార్ తెలిపారు. బాలీవుడ్ స్టార్స్ అయినా, బుకీలు నేరుగా క్రికెటర్లను సంప్రదించినా క్రికెట్‌కు ఏం కాదన్నారు. జూదం చట్టరీత్యా నేరమని పేర్కొన్నాడు. -
బెట్టింగ్ స్కాం ఆరోపణలు సల్మాన్ ఖాన్ సోదరుడికి సమన్లు
-
బెట్టింగ్ స్కాం : సల్మాన్ ఖాన్ సోదరుడికి సమన్లు
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బెట్టింగ్ స్కాంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌కు సమన్లు అందాయి. ఈ మేరకు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. థాణే పోలీసులు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని అర్బాజ్ ఖాన్‌కు నోటీసులు ఇచ్చిందని సదరు రిపోర్టులో పేర్కొన్నారు. టాప్ బుకీల ద్వారా అర్బాజ్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు దొరికిన సోనూ జలాన్ అనే బుకీ విచారణలో అర్బాజ్ పేరును బయటపెట్టినట్లు సమాచారం. కాగా, శనివారం విచారణకు అర్బాజ్ హాజరుకావాల్సివుంది. -
15 కోడి పుంజులతో సహా 18 మంది అరెస్టు
పహాడీషరీఫ్ (హైదరాబాద్): కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం దాడి 18 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో సయ్యద్ అబ్దుల్లా (35) అనే వ్యక్తి కొన్ని రోజులుగా కోడి పుంజులను పెంచడంతో పాటు వాటితో పందాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం స్థానికంగా పాతబస్తీకి చెందిన యువకులతో కలిసి పందాలు నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించి 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 కోడి పుంజులు, రూ.22 వేల నగదు, ఏడు బైక్‌లు, మూడు ఇంజక్షన్లు, 14 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పందెంలో నెగ్గేందుకు కోడి పుంజులకు ఉత్ప్రేరక ఇంజక్షన్లు కూడా ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
పేకాట శిబిరంపైదాడి: ఏడుగురి అరెస్ట్
గోల్నాక (హైదరాబాద్): పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అంబర్‌పేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్సై విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ఎంసీహెచ్ కాలనీ, క్వార్టర్ నంబర్ 17లో ఇమ్రాన్‌అలీ అనే వ్యక్తి పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున 1.15 గంటల సమయంలో ఇమ్రాన్‌అలీ మరో ఆరుగురితో కలసి మూడు ముక్కలాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శిబిరంపై దాడి చేసి మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18,100, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.