బెట్టింగ్‌ స్కాం : సల్మాన్‌ ఖాన్‌ సోదరుడికి సమన్లు | Actor Arbaaz Khan Summoned In IPL Betting Scam | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ స్కాం : సల్మాన్‌ ఖాన్‌ సోదరుడికి సమన్లు

Published Fri, Jun 1 2018 3:49 PM | Last Updated on Fri, Jun 1 2018 4:43 PM

Actor Arbaaz Khan Summoned In IPL Betting Scam - Sakshi

అర్బాజ్‌ ఖాన్‌

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) బెట్టింగ్‌ స్కాంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌కు సమన్లు అందాయి. ఈ మేరకు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. థాణే పోలీసులు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని అర్బాజ్‌ ఖాన్‌కు నోటీసులు ఇచ్చిందని సదరు రిపోర్టులో పేర్కొన్నారు.

టాప్‌ బుకీల ద్వారా అర్బాజ్‌ బెట్టింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు దొరికిన సోనూ జలాన్‌ అనే బుకీ విచారణలో అర్బాజ్‌ పేరును బయటపెట్టినట్లు సమాచారం. కాగా, శనివారం విచారణకు అర్బాజ్‌ హాజరుకావాల్సివుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement