పహాడీషరీఫ్ (హైదరాబాద్): కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు బుధవారం దాడి 18 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో సయ్యద్ అబ్దుల్లా (35) అనే వ్యక్తి కొన్ని రోజులుగా కోడి పుంజులను పెంచడంతో పాటు వాటితో పందాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం స్థానికంగా పాతబస్తీకి చెందిన యువకులతో కలిసి పందాలు నిర్వహిస్తున్నాడు.
సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించి 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 కోడి పుంజులు, రూ.22 వేల నగదు, ఏడు బైక్‌లు, మూడు ఇంజక్షన్లు, 14 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పందెంలో నెగ్గేందుకు కోడి పుంజులకు ఉత్ప్రేరక ఇంజక్షన్లు కూడా ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
15 కోడి పుంజులతో సహా 18 మంది అరెస్టు
Published Wed, Jun 10 2015 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement