
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు విచారణను పంజాగుట్ట పోలీసులు వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని పంజాగుట్టా పోలీసులు ఆ యాప్స్‌ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
వారిలో సినీ నటి, యాంకర్ విష్ణుప్రియు పేరు కూడా ఉంది. పంజాగుట్ట పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. వాట్సప్ ద్వారా నోటీసులు అందుకున్న విష్ణుప్రియ తాజాగా పోలీస్టేషన్‌కు వెళ్లింది. గురువారం ఉదయం తన అడ్వకేట్‌తో కలిసి విష్ణుప్రియ విచారణకు హాజరైంది.
అడ్వకేట్ సమక్షంలో పంజాగుట్ట పోలీసులు ఆమెను విచారణ చేస్తున్నారు. విచారణ సందర్భంగా పోలీసులు ఏయే అంశాలపై ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని విచారించిన పోలీసులు..ఇప్పుడు మిగతా 8 మందిని విచారణకు పిలిచినట్లు తెలిసింది. ప్రమోషన్స్ వెనుక ఎవరు ఉన్నారు? డబ్బులు ఎంత ఇచ్చారు? ఎలా ఇచ్చారు? తదితర విషయాలపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment