మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో రణ్‌బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా ఖురేషికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో నటి శ్రద్ధా కపూర్‌కు సైతం నోటీసులిచ్చారు. ఇవాళ ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించగా.. రణ్‌బీర్ కపూర్ హాజరయ్యేందుకు రెండు వారాల గడువు కోరారు. అయితే ఈరోజు శ్రద్ధా కపూర్ ఈడీ ముందుకు హజరవుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
(ఇది చదవండి: బాలీవుడ్‌లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!)
ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్‌లకు కూడా వేర్వేరు తేదీల్లో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఈడీ ముందు హాజరు కావడానికి రెండు వారాల సమయం కోరినట్లు తెలిపారు. అయితే ఈ కేసులో వీరందరినీ నిందితులుగా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం యాప్ ప్రమోటర్లు వారికి చేసే చెల్లింపు విధానం మాత్రమే ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ మహదేవ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment