మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో బాలీవుడ్ నటులైన హుమా ఖురేషి, కపిల్ శర్మ, హీనా ఖాన్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షుల హోదాలో ముగ్గురు నటులను విచారించనున్నట్లు సమాచారం.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమాచారం ప్రకారం వీరు ముగ్గురూ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వీరు డబ్బును కూడా స్వీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహానికి కూడా కపిల్ శర్మ హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది.
(ఇది చదవండి: సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు)
గడువు కోరిన రణ్‌బీర్ కపూర్!
అయితే ఇప్పటికే అక్టోబర్ 6న అధికారుల ముందు హాజరు కావాలని నటుడు రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అయితే హాజరయ్యేందుకు రెండు వారాల మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది. అతని అభ్యర్థనపై ఈడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహదేవ్ యాప్‌కి సంబంధించిన ప్రమోషన్ల కోసం అతను అందుకున్న మొత్తం... అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల గురించి వివరణ కోరాలని ఈడీ భావిస్తోంది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఏంటి?
మహాదేవ్ బుక్ యాప్ అనేది ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా.. ఈ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరి 2023లో దుబాయ్‌లో తన వివాహ వేడుక కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత విలాసవంతంగా ఈ వేడుక జరిగింది.
ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, అతీఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, కృష్ణ, అభిషేక్ సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. కాగా.. చంద్రాకర్.. మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌తో కలిసి ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ముసుగులో బినామీ ఖాతాల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
(ఇది చదవండి: రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?)
ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources
— ANI (@ANI) October 5, 2023
(file pics) pic.twitter.com/rKXxUgtucl
Comments
Please login to add a commentAdd a comment