హీరోలు చిరంజీవి, మహేష్ బాబు (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) భవనాలకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబుల పేర్లను పెట్టనున్నట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించారు. ఈ ఏడాదితో ‘మా’ ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు ‘మా’ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను అమెరికాలో సెలబ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబులు ‘మా’ కు రెండు రెక్కలు అని కొనియాడారు. ఇంతకాలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు తోడుగా ఉన్నవారందరికి మా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.
‘యూఎస్‌లో మా కార్యక్రమానికి చిరంజీవి పెద్ద మొత్తంలో స్పాన్సర్ చేశారు. సైరా సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నప్పటికి ఆహ్వానించగానే ఏమి ఆలోచించకుండా వస్తానని చెప్పారు. మహేశ్ బాబు కూడా యూఎస్‌లో జరిగే మా సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ ఇద్దరి హీరోలకు ‘మా’ ఎప్పటికి రుణపడి ఉంటుందని’ మా అధ్యక్షుడు అన్నారు. ‘మా’ ఉత్సవాలకు మద్దతుగా నిలిచిన సీనియర్ హీరోలు బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మిగిలిన హీరోలకు మా అధ్యక్షుడు శివాజీ రాజా కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment