silver jubliee celebrations
-
బాండ్ 0025
‘మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్’ అంటూ 57 ఏళ్లుగా, 24 సినిమాలతో అలరిస్తోంది ‘జేమ్స్ బాండ్’ సిరీస్. లేటేస్ట్‌గా సిల్వర్ జూబ్లీ సినిమాకు రెడీ అయింది బాండ్ సిరీస్. గత నాలుగు సినిమాల్లో బాండ్‌గా యాక్ట్ చేసిన డానియల్ క్రెగ్ ఇందులోనూ హీరోగా యాక్ట్ చేయనున్నారు. జమైకా విల్లాలో బాండ్ సృష్టికర్త ఐయాన్ ఫ్లెమింగ్ 25వ సినిమాలోని నటీనటులను అనౌన్స్ చేశారు. క్యారీ జోజీ ఫుకునాగ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఆస్కార్ అవార్డ్ విజేత రామీ మలేక్ విలన్‌గా నటించనున్నారు. నోమి హ్యారిస్, లియా సేడౌస్ బాండ్ గాళ్స్గా కనిపిస్తారు. సినిమా టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు. -
రైతులకు మేలు జరగడం ఉత్తమ్‌కు ఇష్టం లేదు
సాక్షి, హుజూర్నగర్ : రైతులకు ప్రయోజనం చేకూరడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇష్టం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రజలు ఊహించిన పథకాలనే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అమలు పరుస్తున్నారని.. పథకాలు అమలు కాకముందే అవినీతి జరిగిదంటూ కాంగ్రెస్ నాయకులు అభియోగాలు మోపడం దురదృష్టకరమన్నారు. సంక్షేమ పథకాల మీద అవగాహన లేకపోవడం వల్లే కాంగ్రెస్ నాయకులు నిందారోపణలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సన్నద్దమయ్యారని హెచ్చరించారు. రైతులకు పెట్టుబడి రూపంలో 4 వేల రూపాయలు అందిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు. మే 10వ తేదీ నుంచి రైతులకు పెట్టుబడి చెక్కులు అందజేస్తామని ఆయన తెలిపారు. -
చిరు, మహేష్ ‘మా’కు రెండు రెక్కలు..
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) భవనాలకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబుల పేర్లను పెట్టనున్నట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించారు. ఈ ఏడాదితో ‘మా’ ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు ‘మా’ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను అమెరికాలో సెలబ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబులు ‘మా’ కు రెండు రెక్కలు అని కొనియాడారు. ఇంతకాలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు తోడుగా ఉన్నవారందరికి మా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ‘యూఎస్‌లో మా కార్యక్రమానికి చిరంజీవి పెద్ద మొత్తంలో స్పాన్సర్ చేశారు. సైరా సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నప్పటికి ఆహ్వానించగానే ఏమి ఆలోచించకుండా వస్తానని చెప్పారు. మహేశ్ బాబు కూడా యూఎస్‌లో జరిగే మా సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ ఇద్దరి హీరోలకు ‘మా’ ఎప్పటికి రుణపడి ఉంటుందని’ మా అధ్యక్షుడు అన్నారు. ‘మా’ ఉత్సవాలకు మద్దతుగా నిలిచిన సీనియర్ హీరోలు బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మిగిలిన హీరోలకు మా అధ్యక్షుడు శివాజీ రాజా కృతజ్ఞతలు చెప్పారు. -
'ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదు'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) రజతోత్సవ వేడుకల్లో పార్టీ నేత శివపాల్ సింగ్ యాదవ్ ఉద్వేగంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో మూడు సార్లు సమాజ్ వాదీ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి గల కారణం పార్టీ అధ్యక్షుడు ములాయాం సింగ్ యాదవ్ అని అన్నారు. సమస్యలను ఎదుర్కొవడంలో ములాయాం సమర్ధతే ఆయన్ను ఈ స్ధాయికి చేర్చిందని చెప్పారు. పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ విషయాన్ని కార్యకర్తలకు సభాముఖంగా చెబుతున్నానని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన బాగుందని కితాబిచ్చారు. ఈ సర్కారులో గత నాలుగేళ్లుగా ప్రజలకు సేవ చేసినందుకు తనకు ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ కోసం రక్తం ధారపోయడానికైనా తాను సిద్ధమని, తనను ముఖ్యమంత్రి చేయాల్సిన పనిలేదని చెప్పారు. తనను ఎంతగా అవమానించినా పర్లేదని అన్నారు. తాను ఎన్ని మంచి పనులు చేశానో తన ఆత్మకు తెలుసునని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అఖిలేశ్ బాగా పనిచేశారు. పీడబ్ల్యూ శాఖలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించానట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం తనను తాను బలి చేసుకోవడానికైనా సిద్ధమని చెప్పారు. నేతాజీ చెప్పినట్లే పాలనను కొనసాగిస్తానని అన్నారు. తాను జనంలో నుంచి పుట్టిన నాయకుడినని చెప్పిన శివపాల్.. తన గురించి తప్పుడు ప్రచారం చేసే వారి గురించి జాగ్రత్త పడాలని కార్యకర్తలకు సూచించారు. తనను ఎన్నిసార్లు అవమానించినా, ఎన్నిసార్లు పదవి నుంచి తొలగించినా.. తాను చేసిన మంచి పనులు తన ఆత్మకు తెలుసునని అన్నారు.