
ఛరిష్మా, అరుణ్ తేజ్, శ్రీకాంత్
అరుణ్ తేజ్, ఛరిష్మా శ్రీకర్ జంటగా యలమంచలి సమర్పణలో కెఎస్‌పీ ప్రొడక్షన్స్ పతాకంపై బీయన్ రెడ్డి అభినయ దర్శకత్వంలో డా‘‘ ఏఎస్ కీర్తి, డా‘‘ జి.పార్థసారథి రెడ్డి నిర్మిస్తున్న ‘నీతోనే హాయ్..హాయ్’ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీకాంత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు.దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నా కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.
డబ్బున్న వ్యక్తులు, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ల మనస్తత్వాలకు ఉన్న తేడాలు ఏంటీ? అన్న కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. బుధవారం నుంచి షెడ్యూల్ స్టారై్టంది. త్రీ షెడ్యూల్స్‌లో సినిమాను కంప్లీట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.‘‘బీయన్ రెడ్డి అభినయగారి పట్టుదల, తపన చూసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాం. రవికల్యాణ్‌గారు మంచి సంగీతం ఇచ్చారు. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా టీమ్ అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రవీణ్. నటుడు బెనర్జీ, అరుణ్‌తేజ్, ఛరిష్మా శ్రీకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment