సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు | Edaina Jaragochu Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

Published Tue, Aug 13 2019 12:32 AM | Last Updated on Tue, Aug 13 2019 12:32 AM

Edaina Jaragochu Movie Trailer Launch - Sakshi

రమాకాంత్, శివాజీరాజా, విజయ్‌ రాజా, పూజా సోలంకి, సుదర్శన్‌

‘‘ఏదైనా జరగొచ్చు’ సినిమాకి హీరో, హీరోయిన్, దర్శకుడు... అన్నీ రమాకాంతే. మూడేళ్లు ఈ కథని మోస్తూ వస్తున్నాడు. అనుకున్న అవుట్‌పుట్‌ రావడం కోసం రాజీపడకుండా పనిచేశాడు. ఈ సినిమా బాగుందని నేను చెప్పను. విడుదలయ్యాక ప్రేక్షకులే చెబుతారు’’ అని నటుడు శివాజీరాజా అన్నారు. విజయ్‌ రాజా హీరోగా, పూజా సోలంకి, సాషా సింగ్‌ హీరోయిన్స్‌గా కె.రమాకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. సుదర్శన్‌ హనగోడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని శివాజీరాజా విడుదల చేశారు. ‘‘ఏప్రిల్‌ 1న పుట్టిన ముగ్గురు ఫూల్స్‌ చేసే స్టుపిడ్‌ పనుల వల్ల ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు? అన్నదే కథ’’ అన్నారు. ‘‘నటుడిగా నిరూపించుకునే పాత్ర ఈ సినిమాలో దొరికింది’’ అన్నారు అజయ్‌ ఘోష్‌.  ‘‘మా సినిమాని పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు సుదర్శన్‌. ‘‘నాపై నమ్మకంతో ఈ సినిమా తీసిన రమాకాంత్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు విజయ్‌ రాజా. పూజా, సాషా సింగ్, అనంతపురం జగన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement